నార్త్ వాళ్లు 'సైరా' చూసి ఆశ్చర్యపోయారు.. చిరంజీవి కామెంట్స్!

By AN TeluguFirst Published Oct 3, 2019, 3:06 PM IST
Highlights

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా’ చిత్రాన్నిదేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం  చేయడంపై చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేపట్టింది. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదల చేశారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా’ చిత్రాన్నిదేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం  చేయడంపై చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేపట్టింది.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ''సైరా కంటే ముందు  స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర చేయాలనుకున్నాను.  నా కెరీర్ కి బెస్ట్ గా ఉండాలని అనుకునేవాడిని. అది నా డ్రీమ్ క్యారెక్టర్.. పన్నెండేళ్ల క్రితం అలాంటి అవకాశం నాకు పరుచూరి సోదరులు చెప్పారు. కానీ భారీ బడ్జెట్ తో కూడుకున్న పని కావడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాని ప్రేక్షకులకు చూపించగలిగాం. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారని'' చిరు అన్నారు. 

తమ దగ్గర ఉన్న కథకి సురేందర్ రెడ్డి చక్కటి కథనం రాసుకొచ్చాడని..  అదే కథనం తెరపైన కనిపించిందని చెప్పారు. రత్నవేలు తన వర్క్ తో ఎంతో అధ్బుతంగా సినిమాను తీర్చిదిద్దారని చెప్పారు. మూడు వేలకుపైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఈ సినిమాలో ఉన్నాయని.. అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నాయంటే దానికి కారణం కమల్ కన్నన్ గారని ప్రశంసల వర్షం కురిపించారు. సాయి మాధవ్ బుర్రా ఎన్నో అధ్బుతమైన డైలాగ్స్ అందించారని.. అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ ఇలా ప్రతీ ఒక్కరూ ఈ సినిమా కోసం కృషి చేశారని.. తమన్నా తన పాత్రలో ఇమిడిపోయిందని చెప్పారు. 

ఓ గొప్ప యోధుడి కథను సినిమా రూపంలో చెప్పడం సంతోషాన్ని ఇచ్చిందని..  సౌత్ లో ఇంత గొప్ప యోధుడు ఉన్నాడా..? అని నార్త్ వాళ్లు ఆశ్చర్యపోయారని చిరు అన్నారు. ఈ సినిమా స్పెషల్ షో నార్త్ వాళ్లకు చూపిస్తే వాళ్లు స్టాండింగ్ ఒవేషణ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి సినిమాను నా బిడ్డ నిర్మించాడంటే అంతకుమించి నాకేం కావాలి అంటూ ఎమోషనల్ అయ్యారు. వెంకటేష్, మహేష్ బాబు, నాని, నాగార్జున, రాజమౌళి ఇలా ప్రతీ ఒక్కరూ ప్రత్యేకంగా అభినందిస్తుంటే సంతోషంగా ఉందని చెప్పారు. 

click me!