గాంధీకి వస్తాను... మెగాస్టార్ చిరంజీవి , తన సినిమా చూస్తూ.. సర్జరీ చేయించుకున్న ఘటనపై స్పందన

By Mahesh JujjuriFirst Published Aug 27, 2022, 8:26 AM IST
Highlights

హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో జరిగిన అరుదైన ఆపరేషన్ పై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. త్వరలో గాంధీ హాస్పిటల్ కు వస్తానని అన్నారు. అక్కడ జరిగిన ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు సేకరించారు మెగా హీరో. 


హైదరాబాద్ లోని గాంధీ హాప్పిటల్ డాక్టర్లు  ఓ అరుదైన శస్త్ర చికిత్సను చేసి ఘనత సాధించారు. ఓ యాభై ఏళ్ళ మహిళకు ఇంటర్నెట్ ట్యూబ్ లో ,.. సినిమా చూపిస్తూ..  ఆమెతో మాట్లాడుతూ రెండు గంటల పాటు సర్జరీ చేసి అరుదైన రికార్డును సృష్టించారు.  రోగి స్పృహలో ఉండగా ఆమెతో మాట్లాడుతూ చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా చూపిస్తూ, ఆ సినిమా గురించి ఆమెతో మాట్లాడుతూ రెండు గంటల పాటు ఆపరేషన్ చేశారు. 

ఈ ఆపరేషన్ సంబధించిన న్యూస్ వైరల్ అవ్వడంతో.. ఈ విషయం నేరుగా మెగాస్టార్ దగ్గరకు చేరింది. తన సినిమా చూస్తూ.. ఆపరేషన్ చేనయించుకున్న అభిమానిని చూడటానికి మెగాస్టార్ చిరంజీవి సిద్థమవుున్నారు. ఈ విషయం తెలిసి ఆయన ఎంతో సంతోషించారు. సర్జరీ చేయించుకున్న మహిళ.. మెగాస్టార్ కు వీరాభిమాని. ఆయన సినిమాలు ఒక్కటి కూడా వదలకుండా చూస్తుంది. అటు వైద్యులు కూడా ఆమెతో ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. మెగాస్టార్ గురించి మాట్లాడుతూ.. సర్జరీ కంప్లీట్ చేశారు. 

ఇక ఈ విషయం తెలసుకున్న చిరంజీవి తన పీఆర్ టీమ్ ను గాంధీకి పంపించినట్టు తెలుస్తోంది. అక్కడ డాక్టర్స్ టీమ్ జరిగిన సర్జరీకి సంబంధించిన వివరాలు వారికి తెలిపినట్టు సమాచారం. అక్కడి నుంచే మెగాస్టార్ కు ఫోన్ చేసి మాట్లాడిన పిఆర్.. జరిగిన విషయాన్ని ఆయనకు వివరించారట. ఇక వీలు చూసుకుని రెండు మూడు రోజుల్లో తాను గాంధీ హాస్పిటల్ ను సందర్శిస్తానని మెగాస్టార్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి హాస్పిటల్ వర్గాలు ఆనందం వ్యాక్తం చేస్తున్నాయి. 

ఇక ఈ సర్జరీ గురించిన వివరాలు చూస్తే... రోగి స్పృహలో ఉండగానే  మెదడులోని కణితిని  గాంధీ హాస్పిటల్ కు చెందిన   న్యూరో సర్జరీ విభాగం, అనస్తీషియా విభాగం వైద్యులు కలిసి విజయవంతంగా తొలగించారు. అంతే కాదు తాము చేసిన ఈ సర్జరీ సక్సెస్ అయిందని వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ శస్త్రచికిత్సను వైద్యపరిభాషలో అవేక్ క్రానియోటమీ అంటారని వైద్యులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో సినిమా చూస్తూ ఆపరేషన్ చేయించుకున్న మహిళ కూడా వైద్యులకు బాగా సహకరించారని గాంధీ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. 

మనిషి చేతనంగా ఉన్న సమయంలో నిర్వహించే అరుదైన మెదడు శస్త్రచికిత్స ఇది అని డాక్టర్లు అంటున్నారు.  ఇది మెలకువగా మరియు అప్రమత్తంగా ఉన్నప్పుడు మెదడుపై చేసే ఒక రకమైన ప్రక్రియ అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక అరుదైన ఆపరేషన్ చేసి.. చరిత్రలో తమకంటూ ఓ స్థానం సంపాధించకున్నారు గాంధీ వైద్యులు. 

click me!