'టాక్సీవాలా' టీమ్ ని ప్రత్యేకంగా అభినందించిన చిరు!

Published : Nov 28, 2018, 08:41 PM IST
'టాక్సీవాలా' టీమ్ ని ప్రత్యేకంగా అభినందించిన చిరు!

సారాంశం

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో జి ఏ 2, యువి క్రియేషన్స్ బ్యానర్లో ఎస్ కె ఎన్ నిర్మాతగా రూపొందించిన టాక్సీవాలా ఘనవిజయం సాధించి భారీ ఓపెనింగ్స్ తో అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో జి ఏ 2, యువి క్రియేషన్స్ బ్యానర్లో ఎస్ కె ఎన్ నిర్మాతగా రూపొందించిన టాక్సీవాలా ఘనవిజయం సాధించి భారీ ఓపెనింగ్స్ తో అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రం యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు. మెగా అభిమానిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి... పిఆర్వో గా పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేసి... నిర్మాతగా టాక్సీవాలా చిత్రాన్ని రూపొందించి సక్సెస్ అందుకొని మెగాస్టార్ అభినందనలు అందుకోవడం తన జీవితంలో మర్చిపోలేని రోజని నిర్మాత ఎస్ కె ఎన్ ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు. 

నిర్మాత ఎస్ కె ఎన్ మాట్లాడుతూ... మెగా స్టార్ చిరంజీవి గారిని చూస్తూ పెరిగి... మెగా ఫ్యామిలీ అభిమానిగా తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టాను. ఆతర్వాత సినిమా జర్నలిస్ట్ గా పెద్ద సంస్థలో పనిచేసి.. పిఆర్వో గా సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశాను. అల్లు అరవింద్ గారి ఆశీస్సులతో  నిర్మాతగా రూపొందించిన టాక్సీవాలా చిత్రం మంచి పేరు తీసుకొచ్చింది.

టాక్సీవాలా చిత్రం ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు మా చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించడం మరింత బలాన్నిచ్చింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా సాధించి ఆయన అభినందనలు పొందాలనే నా ప్రగాఢ కోరిక టాక్సీవాలాతో నెరవేరింది. మెగాస్టార్ చిరంజీవి గారి అభినందనలతో భవిష్యత్తు లో మరిన్ని మంచి చిత్రాల నిర్మాణంలో భాగస్వామిని అవుతానని ఆశిస్తున్నాను. అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Sobhita Dhulipala: తండ్రి కాబోతున్న నాగ చైతన్య, శోభిత.. సమంతకు అదిరిపోయే షాక్!
Demon Pavan: రీతూ చౌదరికి రూ.5 లక్షల గిఫ్ట్ ? నాగార్జునకి మైండ్ బ్లాక్.. అందరి ముందు రివీల్ చేశాడుగా..