ఆ సీక్వెల్ కోసం 8 కథలు రిజెక్ట్ చేసిన చిరు.. దర్శకుడు అతడే!

Published : Jul 16, 2019, 12:24 PM IST
ఆ సీక్వెల్ కోసం 8 కథలు రిజెక్ట్ చేసిన చిరు.. దర్శకుడు అతడే!

సారాంశం

మెగాస్టార్ నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సీక్వెల్స్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ లాంటి చిత్రాలు ఆ జాబితాలో ఉన్నాయి. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. విడుదల తేదీ ప్రకటించలేదు కానీ.. ప్రస్తుతం సైరా నిర్మాణ కార్యక్రమాలు చివరిదశలో ఉన్నాయి. మెగాస్టార్ నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సీక్వెల్స్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ లాంటి చిత్రాలు ఆ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా ఎవర్గ్రీన్ క్లాసిక్ జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి తరచుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 

ఈ సీక్వెల్ లో రాంచరణ్ నటిస్తే బావుంటుందనే డిమాండ్ కూడా ఉంది. కానీ ఒక క్లాసిక్ చిత్రాన్ని మించి సీక్వెల్ విజయం సాధించాలంటే అంతే బలమైన కథ అవసరం. తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం 'మహానటి' దర్శకుడు నాగ అశ్విన్ జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ కోసం వివిధ వెర్షన్స్ లో కథలు సిద్ధం చేస్తున్నాడట. 

ఇప్పటి వరకు అశ్విన్ మెగాస్టార్ కి 8 స్టోరీ లైన్స్ వినిపించాడట. కానీ దేనికి చిరంజీవి ఇంప్రెస్ కాలేదని టాక్. 1990లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో జగదేక వీరుడు అతిలోక సుందరి జానపద చిత్రంగా యావత్ తెలుగు ప్రజలని ఆకట్టుకుంది. నాగ అశ్విన్ కు కూడా జానపద చిత్రాలపై ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. మహానటి తర్వాత నీతో కలసి పనిచేస్తానని చిరు నాగ అశ్విన్ కు మాట ఇచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

Sushmita konidela కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? చిరంజీవి, పవన్‌ కాదు.. బాబాయ్‌తో మూవీపై క్లారిటీ
టాలీవుడ్ యంగ్ హీరోతో పెళ్లి..? మనసులో మాట బయటపెట్టిన మీనాక్షి చౌదరి