హీరోయిన్ కాస్ట్లీ ఇల్లు.. ఏ నిర్మాత కొనిపెట్టాడో..?

By Udayavani DhuliFirst Published Dec 26, 2018, 11:27 AM IST
Highlights

'ఇద్దరమ్మాయిలతో' చిత్రంతో తెలుగునాట కాస్త గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ కేథరిన్ ఆ తరువాత వరుసగా అల్లు అర్జున్ చిత్రాల్లోనే నటించింది. టాలీవుడ్ లో లీడ్ హీరోయిన్ పాత్రలు రాకపోవడంతో అమ్మడు కోలివుడ్ కి వెళ్లి అక్కడ అవకాశాలు దక్కించుకుంటోంది. 

అయినప్పటికీ టాలీవుడ్ మీద మక్కువ చావక ఇక్కడ కూడా ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తోంది. దానికోసం హైదరాబాద్ లోనే ఉంటూ చెన్నైకి ట్రావెల్ చేస్తుంది. హైదరాబాద్ కోకాపేట్ లో ఈ బ్యూటీ ఓ ఇల్లు కొనుక్కుంది. దాదాపు రెండున్నర కోట్లు పెట్టి కేథరిన్ ఇంటిని కొనుగోలు చేసింది.

అక్కడ వరకు బాగానే ఉంది. అయితే అసలు అవకాశాలే లేని కేథరిన్ ఇంత కాస్ట్లీ ఇల్లు ఎలా కొనుక్కుందంటూ చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఏ నిర్మాతో, హీరోనో ఆమెకి ఇల్లు కొనిచ్చారంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లలో కష్టపడి సంపాదించిన డబ్బుని పోగుచేసి తనకి తాను గిఫ్ట్ ఇచ్చుకుంటే ఇలాంటి వార్తలు రావడం పట్ల బాధపడుతోందట ఈ బ్యూటీ. హీరోయిన్లు అన్నాక ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ కామన్ అని కేథరిన్ ఎప్పుడు గ్రహిస్తుందో!

click me!