మహేష్ బాబుకి గతంలో స్టోరీ చెప్పా, ఆయన అడిగిన డౌట్ ఏంటంటే.. బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు 

బోయపాటి చిత్రం అంటే నరాలు ఉప్పొంగే యాక్షన్ ఘట్టాలు ఉంటాయి. బోయపాటి సినిమాలకు అదే ప్రధాన బలం. ఎలాంటి హీరో అయినా బోయపాటి చిత్రంలో నటిస్తే వారి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోతుంది.

Boyapati Srinu interesting comments on movie with Mahesh Babu dtr

బోయపాటి చిత్రం అంటే నరాలు ఉప్పొంగే యాక్షన్ ఘట్టాలు ఉంటాయి. బోయపాటి సినిమాలకు అదే ప్రధాన బలం. ఎలాంటి హీరో అయినా బోయపాటి చిత్రంలో నటిస్తే వారి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోతుంది. హీరోలు విలన్లపై విరుచుకుపడడం కూడా బోయపాటి చాలా క్రూయల్ గా ప్రజెంట్ చేస్తారు. 

రీసెంట్ గా బోయపాటి తెరకెక్కించిన స్కంద మూవీ పర్వాలేదనిపించే విధంగా బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. వరుసగా బోయపాటి ఒకే తరహా చిత్రాలు చేస్తున్నారనే విమర్శ ఉంది. అయితే బోయపాటి చాలా కాలంగా బాలయ్య తోనే ఎక్కువగా చిత్రాలు చేస్తున్నారు. 

Latest Videos

అయితే ఇతర స్టార్ హీరోలతో బోయపాటి ప్రయత్నించడం లేదా అనే క్రమం లో మహేష్ బాబు గురించి ప్రస్తావన వచ్చింది. దీని గురించి బోయపాటి మాట్లాడుతూ  మహేష్ బాబుతో తప్పకుండా సినిమా చేస్తానని అన్నారు. అయితే గతంలో మహేష్ బాబుకి కథ చెప్పడం జరిగింది అని బోయపాటి అన్నారు. ఆ సమయంలో మహేష్ బాబు ఒక డౌట్ అడిగారు. బోయపాటి గారు ఇది హై మీటర్ లో ఉండదు కదా అని అడిగారు. 

నేను లేదు బాబు అన్ని పక్కాగా ప్రిపేర్ చేశాను అని చెప్పా. మీరు నాతో ఒకరి వర్క్ చేయండి మీకే అర్థం అవుతుంది అని చెప్పా. ఓకె అనుకున్నాం. కానీ ఆయన చేస్తున్న చిత్రం పూర్తి అయ్యే లోపు నేను వేరే మూవీ మొదలు పెట్టడం జరిగింది. ఆ విధంగా ఆయనకి కుదిరినప్పుడు నాకు కుదరకపోవడం.. నాకు కుదిరినప్పుడు ఆయనకి కుదరకపోవడం జరుగుతూ వస్తోంది. అదే సమయంలో మహేష్ బాబు క్లాసు, మాస్ ఎలాంటి సబ్జెక్టు అయినా చేయగలరు అని బోయపాటి అన్నారు. 

vuukle one pixel image
click me!