మొత్తానికి బోయపాటికి ఓ నిర్మాత దొరికాడు, ఎవరంటే...

By tirumala ANFirst Published Sep 1, 2019, 1:59 PM IST
Highlights

‘వినయ విధేయ రామ’ కమర్షియల్ గా డిజాస్టర్ అయిన తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను తన క్రేజ్ మొత్తం పోగొట్టుకున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తో సమానం అయ్యిపోయారు. హీరోలు ఎవ్వరూ బోయపాటి దర్శకత్వంలో చేయటానికి ఆసక్తి చూపటం లేదు. 

‘వినయ విధేయ రామ’ కమర్షియల్ గా డిజాస్టర్ అయిన తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను తన క్రేజ్ మొత్తం పోగొట్టుకున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తో సమానం అయ్యిపోయారు. హీరోలు ఎవ్వరూ బోయపాటి దర్శకత్వంలో చేయటానికి ఆసక్తి చూపటం లేదు. మరీ ముఖ్యంగా వినయ విధేయ రామ చిత్రం సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడటం మెగా క్యాంప్ కు మండిపోయేటట్లు చేసింది. దాంతో ఆ హీరోలు కూడా ఎవరూ బోయపాటిని దగ్గరకు రానివ్వటం లేదు. హీరోలు లేకపోతే నిర్మాతలు ఉండరు.

అయితే క్లిష్టపరిస్దితుల్లోనూ బాలయ్య ఒక్కరే బోయపాటి దర్శకత్వంలో చిత్రం చేయటానికి ముందుకు వచ్చారు. జూన్ నుంచి సినిమా స్టార్ట్ అవుతుందనుకున్న టైమ్ లో దర్శకుడు కెఎస్ రవికుమార్ సీన్ లోకి వచ్చారు. బాలయ్యతో సినిమా ప్రారంబించారు. దాంతో బోయపాటికు ఉన్న ఏకైక హీరో కూడా హ్యాండ్ ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. 

అయితే బాలయ్య అలా చేయటానికి కారణం ..ఈ ప్రాజెక్టుకు భారి బడ్జెట్ అవసరం అవటం, అదీ తనే పెట్టాలని బోయపాటి అడగటం అని తెలిసింది. ఈ నేపధ్యంలో వేరే నిర్మాత దొరికితే సినిమా చేద్దామన్నారు బాలయ్య.  అప్పటి నుంచి వేట మొదలెడితే ఇన్నాళ్లకు బోయపాటికి ఓ నిర్మాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. ఆయన మరెవరో కాదు మిర్యాల రవీందర్ రెడ్డి. 

గతంలో ఇదే నిర్మాతతో బోయపాటి శ్రీను ...జయ జయ నాయక అంటూ చిత్రం చేసారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలింది. దాంతో మళ్లీ బోయపాటితో చేయటానికి ఎలా ముందుకు వచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే బోయపాటి తాను రెమ్యునేషన్ తీసుకోనని, బాలయ్య చేత ఒప్పిస్తానని, లాభాల్లో షేర్ తీసుకుందామని చెప్తానని , నిర్మాతను ఒప్పించినట్లు తెలుస్తోంది.

click me!