పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రంలో నటించిన బాలీవుడ్ నటి ఎవెలిన్ శర్మ తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. రెండోసారి తను తల్లికాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.
హిందీ చిత్రాలతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి ఎవెలిన్ శర్మ (Evelyn Sharma). పెళ్లికి ముందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. 2019 అక్టోబర్ లో ఎవెలిన్ శర్మకు ఇండో-ఆస్ట్రేలియన్ డెంటల్ సర్జన్, వ్యాపారవేత్త తుషాన్ భిండితో నిశ్చితార్థం జరిగింది. 2021 మే 5న ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో వీరి వివాహం గ్రాండ్ గా జరింది. ఇక అదే ఏడాది నవంబర్ లో మొదటి పాపకు జన్మనిచ్చింది.
తాజాగా అభిమానులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. తాను మళ్లీ తల్లికాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా తన బేబీ బంప్ ను చూపిస్తూ త్వరలో రెండో బేబీ కూడా వచ్చేస్తుందంటూ ఆనందం వ్యక్తం చేసింది. ‘సెకండ్ బేబీ వస్తోంది. తనని నా భుజాలపై ఎత్తుకోవడానికి ఎదురుచూస్తున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అభిమానులతో ఆమె శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక, 2012 నుంచి లాక్ డౌన్ ముందు వరకు ఇండస్ట్రీలో యాక్టివ్ ఉండిందీ బ్యూటీ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. రన్బీర్ కపూర్ - దీపికా పదుకొనె జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘యే జవానీ హై దీవానీ’లో సెకండ్ హీరోయిన్ గా నటించి ఫేమ్ దక్కించుకుంది. అప్పటి నుంచి అలరిస్తూనే వస్తోంది. ఇక 2019లో డార్లింగ్ ప్రభాస్ తో యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ‘సాహో’లోనూ ముఖ్య పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరిచింది. ఆ తర్వాత మరో చిత్రంలో మెరిసి.. పెళ్లి చేసుకుంది. పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఫ్యామిలీతోనే సమయం గడుపుతోంది.