ఈ సీజన్‌లో ఇప్పటికే సోహైల్ ఫస్ట్ గా ఆఫర్ కొట్టేశాడు. హీరోగా ఓ సినిమాని ప్రకటించాడు. ఇక మోనాల్ `స్టార్‌మా` డాన్స్ ప్లస్‌లో జడ్జ్ గా ఆఫర్ కొట్టేసింది. బిగ్‌బాస్4 విన్నర్ అభిజిత్‌కి పలు ఆఫర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మెహబూబ్ జాక్‌పాట్ కొట్టేసినట్టు తెలుస్తుంది. ఏకంగా మెగాస్టార్ స్వయంగా ఆఫర్ ఇచ్చిన సమాచారం.
బిగ్‌బాస్‌తో చాలా మందికి పాపులారిటీ వస్తుంది. నాలుగు సీజన్లలో అనేక మంది కంటెస్టెంట్లు ఫ్యామిలీ ఆడియెన్స్ లో నోట్లో నాలుకలా మారారు. బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్లకి ఇంకా మరింత గుర్తింపు దక్కింది. కరోనా కారణంగా థియేటర్లు లేకపోవడం, సోషల్ మీడియా బాగా పెరగడం, ఉన్న ప్రధాన మాధ్యమం టీవీ కావడంతో అంతా బిగ్‌బాస్‌ని తిలకించారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హౌజ్‌లో జరిగిన విషయాలపై చర్చ జరగడం కంటెస్టెంట్లకి గుర్తింపు తెచ్చింది. అంతేకాదు ఇప్పుడు అవకాశాలను తీసుకొస్తున్నారు.
గత సీజన్‌లో ఉన్న వాళ్లకి పెద్ద ఆఫర్స్ వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈ సీజన్‌లో ఇప్పటికే సోహైల్ ఫస్ట్ గా ఆఫర్ కొట్టేశాడు. హీరోగా ఓ సినిమాని ప్రకటించాడు. ఇక మోనాల్ `స్టార్‌మా` డాన్స్ ప్లస్‌లో జడ్జ్ గా ఆఫర్ కొట్టేసింది. బిగ్‌బాస్4 విన్నర్ అభిజిత్‌కి పలు ఆఫర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మెహబూబ్ జాక్‌పాట్ కొట్టేసినట్టు తెలుస్తుంది. ఏకంగా మెగాస్టార్ స్వయంగా ఆఫర్ ఇచ్చిన సమాచారం.
బిగ్‌బాస్4 ఫైనల్ ఈవెంట్‌లో ఆర్ఫనేజ్ కోసం సోహైల్, మెహబూబ్ పది లక్షలు డొనేట్ చేస్తామని ప్రకటించారు. అది నచ్చి చిరంజీవి మెహబూబ్‌కి పది లక్షలు ప్రకటించారు. అంతేకాదు అతని డాన్స్ స్కిల్స్ పై ప్రశంసలు కురిపించారు. హౌజ్‌లో అందరికంటే బాగా డాన్స్ చేస్తాడని ఆకాశానికి ఎత్తాడు. అంతటితో ఆగలేదు, ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` చిత్రంలో ఆఫర్ ఇస్తున్నట్టు సమాచారం. దర్శకుడు కొరటాల శివకి ఈ విషయం చెప్పారట. ఏదైనా పాత్రకి మెహబూబ్‌ని తీసుకోవాలని సూచించారట. అందుకు కొరటాల కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.