Published : Nov 20, 2024, 06:28 AM IST

Bigg Boss Telugu 8 live Updates|Day 80: స్నేహితులకి విష్ణుప్రియ వెన్నుపోటు

సారాంశం

బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ నెమ్మదిగా ముసుగు తీస్తోంది అంటూ రోహిణి, అవినాష్ ఆరోపిస్తున్నారు. అనవసరమైన నామినేషన్స్ పాయింట్స్ బయటకి తీసి స్నేహితులకే వెన్నుపోటు పొడుస్తోంది అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Bigg Boss Telugu 8 live Updates|Day 80: స్నేహితులకి విష్ణుప్రియ వెన్నుపోటు

01:16 PM (IST) Nov 20

పృథ్వీ, అవినాష్ ఒకరిపై ఒకరు దాడి

బుధవారం రోజు జరగబోయే ఫైనల్ మెగా చీఫ్ టాస్క్ లో పృథ్వీ, అవినాష్ ఫిజికల్ గా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నట్లు ప్రోమోలో అర్థం అవుతోంది. ఎవరి టీ షర్ట్ ని వాళ్ళు సేఫ్ గా ఎండ్ బజర్ వరకు కొనసాగించాలి. ఇతరులు ఆ టీ షర్ట్ ని చెంచేయాలి. ఈ క్రమంలో పృథ్వీ, అవినాష్ దాడికి దిగారు. మరోవైపు యష్మి, విష్ణు మధ్య మాటల యుద్ధం సాగింది. 

01:08 PM (IST) Nov 20

బిగ్ బాస్ హౌస్ లో చివరి మెగా చీఫ్ పై ఉత్కంఠ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 80 వ రోజుకి సంబంధించిన ప్రోమో వచ్చింది. హౌస్ లో పరిణామాలు అత్యంత ఉత్కంఠగా మారుతున్నాయి. ఎందుకంటే హౌస్ లో చివరి మెగా చీఫ్ పోటీ మొదలు కాబోతోంది. బయటి నుంచి టీ షర్ట్స్ వస్తాయి. ఎవరి పేరుపై టీ షర్ట్స్ వస్తే వాళ్ళు దానిని కాపాడుకుని ఎండ్ బజర్ తర్వాత బొమ్మకి తొడగాలి. అప్పుడే వాళ్ళకి మెగా చీఫ్ పోటీలో నిలిచే ఛాన్స్ దక్కుతుంది. 

 

06:28 AM (IST) Nov 20

విష్ణుప్రియ ముసుగు తీస్తోంది, స్నేహితులకే వెన్నుపోటు

బిగ్ బాస్ హౌస్ లో విష్ణుప్రియ నెమ్మదిగా ముసుగు తీస్తోంది అంటూ రోహిణి, అవినాష్ ఆరోపిస్తున్నారు. అనవసరమైన నామినేషన్స్ పాయింట్స్ బయటకి తీసి స్నేహితులకే వెన్నుపోటు పొడుస్తోంది అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రోహిణి, అవినాష్ విష్ణుప్రియ అసలు రంగు గురించి గౌతమ్ తో చర్చించారు. తాను విష్ణుప్రియ చేస్తున్న తప్పులు చెబుతున్నా ఆమెకి నచ్చడం లేదు. నువ్వు నాకు చెప్పకు రోహిణి అంటూ వాదిస్తోంది అని.. రోహిణి అసహనం వ్యక్తం చేసింది. 


More Trending News