Bigg Boss Telugu 9: బయట ప్రేక్షకుల్లో ఈ సీజన్‌కి పెద్దగా బజ్ లేకపోయినా, హౌస్‌లో మాత్రం రచ్చ రచ్చ జరుగుతోంది. మొదటి వారంలో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కాగా, కామనర్ హరీష్ బిగ్ బాస్ పైనే ఫైట్ చేస్తూ హోస్ట్ నాగార్జున తీరుని ఎండగడుతున్నాడు. నాగ్ ఇచ్చిన క్లాస్‌కి రెచ్చిపోయిన హరీష్ నిరాహార దీక్ష కూడా చేపట్టాడు.
నామినేషన్స్ ఎపిసోడ్‌లో హౌస్ మేట్స్ ఎక్కువగా హరిత హరీష్ను టార్గెట్ చేస్తూ నామినేట్ చేశారు. ఆ తర్వాత భరణి కూడా లిస్టులో చేరాడు. ఈ వారం నామినేట్ అయినవారు – హరీష్, భరణి, మనీష్, ప్రియ, పవన్, ఫ్లోరా సైనీ. కామనర్స్ మధ్యన గొడవలు హౌస్‌లో హీట్ పెంచుతున్నాయి.
07:26 PM (IST) Sep 16
హరిత హరీష్ గత రెండు మూడు రోజులుగా డిస్టర్బ్ గా ఉంటున్నాడు. శనివారం, ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున.. ఆయన రియాలిటీని బయటపెట్టడంతో తట్టుకోలేకపోయాడు. తన తప్పులను ఆయన రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు. దీంతో మౌనంగా ఉన్నాడు. భోజనం చేయడం కూడా మానేశాడు. ఈక్రమంలో ఆయన్ని బుజ్జగించే చర్యలు చేపట్టారు. బిగ్ బాస్ ఆల్ రెడీ చెప్పాడు. రాము రాథోడ్‌కి ఆ బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు తనూజ కూడా ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేసింది. నామినేషన్‌లో వీరిద్దరి మధ్య గట్టిగా వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత వెళ్లి ఆయన్ని కూల్ చేసే ప్రయత్నం చేసింది. తన రియాలిటీని చాటి చెప్పింది. అదే సమయంలో హరీష్‌కి ఎలా ఉండాలో హితబోధ చేసింది.
05:16 PM (IST) Sep 16
హరిత హరీష్ నిన్నటి వరకు సైలెంట్‌గా ఉన్నాడు. బాధపడుతూ కనిపించాడు. కానీ నామినేషన్‌లో మాత్రం రెచ్చిపోయాడు. తనదైన స్టయిల్‌లో కౌంటర్ ఇస్తూ కంటెస్టెంట్లని ఆడుకున్నారు. ఈ క్రమంలో రీతూ చౌదరీపై ఆయన ఫైర్ అయ్యారు. దెబ్బకి ఆమె ఎమోషనల్ అయ్యింది.
05:10 PM (IST) Sep 16
సుమన్ శెట్టి ఒకప్పుడు మంచి కమెడియన్ అనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన బిగ్ బాస్ తెలుగు 9లో సందడి చేస్తున్నారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఆయన ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. సరదాగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నామినేషన్‌లో సంజనా గల్రానీ నామినేట్ చేస్తుండగా, ఆమె ఫైర్ అయ్యింది.