Bigg Boss Telugu 9 Live: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రెండో వారానికి కెప్టెన్‌గా డీమాన్ పవన్ సెలక్ట్ అయ్యారు. ప్రేయసి రీతూ చౌదరి కోరికపై అతను కెప్టెన్ పదవి కోసం ప్రయత్నించి విజయం సాధించాడు. ఈవారం కెప్టెన్సీ పోటీకి డీమాన్ పవన్‌తో పాటు మనీష్, భరణి, ఇమ్మానుయేల్ పోటీ పడగా, ఫిజికల్ టాస్క్‌లో గెలిచి పవన్ కెప్టెన్‌గా నిలిచాడు. ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్నా, కెప్టెన్ అయ్యినందున ఎలిమినేషన్ నుంచి బయటపడ్డాడు.

04:51 PM (IST) Sep 19
బిగ్ బాస్ తెలుగు 9 శుక్రవారం ఎపిసోడ్ కి సంబంధించి మరో ప్రోమో వచ్చింది. ఇందులో టాస్క్ ఆసక్తికరంగా సాగింది. ఫ్రెండ్స్ గా ఉన్నా రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయెల్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత రీతూ, తనూజల మధ్య వాగ్వాదం వేరే లెవల్‌లో సాగింది. దీంతో ఆట ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ ఇద్దరు బ్యూటీస్ మధ్య భలే చిచ్చు పెట్టాడుగా.
01:41 PM (IST) Sep 19
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. తాజాగా కంప్లీట్ అయిన కెప్టెన్సీ టాస్ పూర్తి అయినా విషయం తెలిసిందే. ఈ టాస్క్ తో హౌస్‌లో ఘర్షణలు, వ్యూహాలు, నాటకీయతలు, భావోద్వేగాలు ఉప్పొంగిపోయాయి. కెప్టెన్సీ కోసం పోటీ పడిన కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు వ్యూహాలతో దాడి చేయగా, కొందరు భావోద్వేగాలకు లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎవరిని నమ్మాలి? ఎవరు ఎవరికి ద్రోహం చేశారు? అదే బయటపడింది.
11:41 AM (IST) Sep 19
Bigg Boss Telugu 9 Day 12 Promo 1 : బిగ్ బాస్ రియాల్టీ షో ఆసక్తికరంగా కొనసాగుతుంది. హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య మరో చిచ్చుపెట్టే ప్రయత్నం బిగ్ బాస్ చేశాడు. టెనెంట్స్ కు ఓనర్స్ గా మారే అవకాశాన్ని కల్పిస్తూ ఓ టాస్క్ ఇచ్చారు. ఓనర్స్ ఇచ్చే వస్తువులను ఎవరైతే.. జాగ్రత్త భద్రపరుస్తారో వారు ఓనర్స్ గా మారుతారని తెలిపారు. ఈ ఉత్కంఠ భరితమైన టాస్క్ కు సంచాలక్ గా ప్రియా శెట్టి వ్యవహరించారు. ఈ ట్కాస్ లో సుమన్ షెట్టి ఫైర్ అయ్యారు.