Bigg Boss Telugu 9 Live: బిగ్‌బాస్ హౌస్‌లో రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఈ వారం మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. అయితే నిజానికి ఆరుగురు మాత్రమే లిస్ట్‌లో ఉన్నారు. కానీ సంజన కెప్టెన్ కావడంతో బిగ్‌బాస్ ఒక సూపర్ పవర్ ఇవ్వడంతో ఆమె ఓ కంటెస్టెంట్ ను నేరుగా నామినేట్ చేసింది. నామినేషన్ లో భరణి, హరీష్, ఫ్లోరా, మనీష్, ప్రియ, డీమన్ పవన్, సుమన్ శెట్టి లు ఉన్నారు.

04:28 PM (IST) Sep 17
Bigg Boss 9 Promo: బిగ్ బాస్ 9 రోజురోజుకీ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో రీతూ చౌదరి ఫుల్ హైలైట్ అయ్యింది. కళ్యాణ్‌కి ఫ్లర్ట్ చేస్తూ డైలాగులు చెప్పిన ఆమె, కొద్దిసేపటికి డీమాన్ పవన్‌కి గోరుముద్దలు తినిపించింది. ఒకే ప్రోమోలో రెండు వేరియేషన్స్ చూపించడంతో సోషల్ మీడియాలో రీతూ, కామనర్స్‌పై “కరువులో ఉన్నారు” అంటూ కామెంట్లు వస్తున్నాయి.
ప్రోమో స్టార్ట్‌లో ఫీల్‌గుడ్ మ్యూజిక్ పెట్టి, ఎండ్‌లో రాధిక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేశారు. దీంతో “ఇది రీతూ కాదు, రాధిక స్టైల్” అని నెటిజన్లు స్పందిస్తున్నారు. గతంలో కూడా రీతూ రియాలిటీ షోలలో ఇలాంటివి చేసినట్లు గుర్తుచేస్తున్నారు.
02:00 PM (IST) Sep 17
Bigg Boss 9: బిగ్ బాస్ 9లో పదవ రోజు ప్రోమో నవ్వుల వర్షం కురిపించింది. ఇమ్మానుయేల్–తనూజా మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఇమ్ము ఫోన్ మాట్లాడకుండా ముద్దుల వర్షం కురిపించగా, తనూజా ఫోన్ కట్ చేసింది. మళ్లీ కాల్ చేసి “నువ్వు రమేష్ కాదా?” అంటూ జలక్ ఇవ్వడంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. ఇక ఎలిమినేషన్స్ విషయానికి వస్తే, ఈ వారం మాస్క్ మ్యాన్ హరీష్ పై ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తోంది. ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. మరి ఎవరు బయటకు వెళ్తారో వీకెండ్‌లో తేలనుంది.