Published : Nov 21, 2024, 06:38 AM IST

Bigg Boss Telugu 8 live Updates|Day 81: కిరాక్ సీత కామెంట్ తో కుమిలిపోతున్న నిఖిల్

సారాంశం

కిరాక్ సీత సంచలన వ్యాఖలు చేయడంతో నిఖిల్ కుమిలిపోతున్నాడు. ఆడవాళ్ళ ఎమోషన్స్ ని అడ్డం పెట్టుకుని హౌస్ లో కొనసాగుతున్నాడు అంటూ సీత స్టేట్మెంట్ ఇచ్చింది. 

Bigg Boss Telugu 8 live Updates|Day 81: కిరాక్ సీత కామెంట్ తో కుమిలిపోతున్న నిఖిల్

12:07 PM (IST) Nov 21

ఎవడ్రా నువ్వు.. హద్దులు దాటిన గౌతమ్, పృథ్వీ

పృథ్వీ, గౌతమ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. పృథ్వికి మద్దతుగా యష్మి మాట్లాడింది. ఆ తర్వాత విష్ణుప్రియ కూడా పృథ్వీకి మద్దతుగా గౌతమ్ తో గొడవ పెట్టుకుంది. దీనితో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నీకేంటి బాధ అని గౌతమ్ విష్ణుప్రియకి కౌంటర్ ఇచ్చాడు. గొడవ ఎక్కువ కావడంతో పృథ్వీ ఎవడ్రా నువ్వు అని గౌతమ్ పై నోరు జారాడు.. గౌతమ్ కూడా నువ్వెవడ్రా అంటూ కౌంటర్ ఇచ్చాడు. 

12:07 PM (IST) Nov 21

వైల్డ్ కార్డు సభ్యులపై కుట్ర చేస్తున్నారు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 81 వ రోజు వ్యవహారం మరింత హీటెక్కింది. తాజాగా విడుదలైన ప్రోమోలో గౌతమ్, పృథ్వీ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. వైల్డ్ కార్డు సభ్యులపై కుట్ర చేసి ఒక్కరొక్కరుగా బయటకి పంపాలని కొందరు ప్రయత్నిస్తున్నట్లు గౌతమ్ ఆరోపించారు. దీనితో పృథ్వీ.. గౌతమ్ మాటలపై మండిపడ్డాడు. గౌతమ్ మాత్రం నీ ఒపీనియన్ నువ్వు చెప్పు నా ఒపీనియన్ నేను చెబుతా అని తెలిపాడు. 

 

06:39 AM (IST) Nov 21

కిరాక్ సీత కామెంట్ తో కుమిలిపోతున్న నిఖిల్

కిరాక్ సీత సంచలన వ్యాఖలు చేయడంతో నిఖిల్ కుమిలిపోతున్నాడు. ఆడవాళ్ళ ఎమోషన్స్ ని అడ్డం పెట్టుకుని హౌస్ లో కొనసాగుతున్నాడు అంటూ సీత స్టేట్మెంట్ ఇచ్చింది.  నీకు ఇన్ని నిందలు నా వల్లే అంటూ యష్మి నిఖిల్ కి సారీ చెప్పింది. ఇకపై మనిద్దరం మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే గేమ్ పాడవుతోందని అంటున్నారు అంటూ చెప్పింది. దీనితో నిఖిల్ ఒంటరిగా కూర్చుని కుమిలిపోయాడు. సీత చెప్పినట్లు తాను ఆడవాళ్ళని అడ్డుపెట్టుకుని గేమ్ ఆడట్లేదు అని కెమెరాలకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. 


More Trending News