Published : Dec 13, 2024, 06:45 AM IST

Bigg Boss Telugu 8 live Updates|Day 103: తమ జర్నీ చూసుకుని అవినాష్, గౌతమ్ ఎమోషనల్

సారాంశం

గౌతమ్, అవినాష్ ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లో తమ జర్నీ చూసుకోవడంతో ఎమోషనల్ అయ్యారు. సీజన్ 8 లో పాల్గొని లైఫ్ మొత్తానికి కావలసి అనుభూతులని పొందినట్లు ఇద్దరూ సంతోష పడ్డారు.

Bigg Boss Telugu 8 live Updates|Day 103: తమ జర్నీ చూసుకుని అవినాష్, గౌతమ్ ఎమోషనల్

07:03 PM (IST) Dec 13

నబీల్ నువ్వు వరంగల్ కా షేర్!

నబీల్ ని ఒక రేంజ్ లో ఎత్తాడు బిగ్ బాస్. నువ్వు వరంగల్ గా షేర్ అన్నాడు. నామినేషన్స్ లో నీ ఫైర్ అద్భుతం అన్నాడు. సెల్ఫ్ మేడ్ అయిన నీకు ఆత్మభిమానం ఎక్కువ అన్నాడు. బిగ్ బాస్ పొగడ్తలకు నబీల్ మురిసిపోయాడు. 

04:46 PM (IST) Dec 13

బిగ్ బాస్ మాటలకు కన్నీరు పెట్టుకున్న ప్రేరణ

కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ చివరి వారం అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. వారి బిగ్ బాస్ షో ప్రయాణాన్ని తెలియజేస్తూ అద్భుతంగా రూమ్ డెకరేట్ చేసి లోపలికి పిలుస్తున్నారు. ప్రేరణ వంతు రాగా ఆమె ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యింది. బిగ్ బాస్ ఎమోషనల్ వర్డ్స్ కి ప్రేరణ కన్నీరు పెట్టుకుంది. 

12:58 PM (IST) Dec 13

ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్

లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం గౌతమ్ కి భారీగా ఓట్లు పోల్ అవుతున్నాయి. అతడు నిఖిల్ కంటే చాలా ముందు ఉన్నాడట. గౌతమ్ కి 42 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అదే సమయంలో నిఖిల్ కి దాదాపు 37 శాతం ఓట్లు పోల్ అయ్యాయట. ఇద్దరి మధ్య 5 శాతం ఓటింగ్ వ్యత్యాసం ఉంది. మరి ఇదే చివరి వరకు కొనసాగితే గౌతమ్ టైటిల్ విన్నర్ అవుతాడు.

10:43 AM (IST) Dec 13

బిగ్ బాస్ బ్రతకడం నేర్పించింది

చివరి వారం బిగ్ బాస్ హౌస్లో ఫైనలిస్ట్స్ జర్నీ వీడియోలు ప్రదర్శిస్తున్నారు. ప్రతి కంటెస్టెంట్ అనుభవాలను ఫోటోలు, వస్తువుల రూపంలో ఒక చోట చేర్చి, వారికి తమ ప్రయాణాన్ని గుర్తు చేస్తున్నారు. నిఖిల్ గురించి కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పిన బిగ్ బాస్, అతన్ని సర్ప్రైజ్ చేశాడు. బిగ్ బాస్ ఎలా బ్రతకాలో నేర్పిందని నిఖిల్ అన్నాడు. 

06:46 AM (IST) Dec 13

తమ జర్నీ చూసుకుని అవినాష్, గౌతమ్ ఎమోషనల్

గౌతమ్, అవినాష్ ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లో తమ జర్నీ చూసుకోవడంతో ఎమోషనల్ అయ్యారు. సీజన్ 8 లో పాల్గొని లైఫ్ మొత్తానికి కావలసి అనుభూతులని పొందినట్లు ఇద్దరూ సంతోష పడ్డారు. అంత కాదు... లైఫ్ లో చాలా విషయాలు తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఉపయోగపడినట్లు గౌతమ్, అవినాష్ తెలిపారు. కమెడియన్లు బిగ్ బాస్ టైటిల్ గెలవలేరు అని కొందరు అంటుంటారు. బాగా పెర్ఫామ్ చేస్తే కమెడియన్స్ ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉన్నట్లు అవినాష్ తెలిపాడు. 


More Trending News