బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికర ముగింపు దిశగా వెళుతోంది. ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలేతో బిగ్ బాస్ 8 తెలుగు కి ఎండ్ కార్డు పడనుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కి మామగారు సీరియల్ నటులు ఆకర్ష్, సుహాసిని ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో ఉన్న సభ్యుల బ్రేకప్ స్టోరీలు అడిగి తెలుసుకున్నారు.

08:42 PM (IST) Dec 11
మరి కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. నబీల్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, అవినాష్.. ఫైనలిస్ట్స్ గా ఉన్నారు. కాగా వీరిలో అవినాష్ ఓటింగ్ లో వెనబడ్డాడట. చాలా తక్కువ ఓటింగ్ అవినాష్ కి నమోదు అవుతుందట. ఏ మాత్రం పోటీ ఇవ్వలేకున్నాడట.
07:47 PM (IST) Dec 11
చివరి వారం ఓటింగ్ లో హోరాహోరీ పోరు నెలకొంది. గౌతమ్ మొదటి స్థానంలో, రెండవ స్థానంలో నిఖిల్ ఉన్నారట. అయితే ఓట్ల తేడా చాలా స్వల్పం అట. జస్ట్ పాయింట్స్ లో డిఫరెన్స్ ఉందట. నిఖిల్ నాన్ లోకల్ అనేది అతనికి మైనస్. అదే సమయంలో గౌతమ్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ మైనస్. ఇక ప్రేక్షకులు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.
05:21 PM (IST) Dec 11
బిగ్ బాస్ హౌస్లోకి మరో బుల్లితెర సీరియల్ జంట వచ్చారు. వారు ఓ ఫన్నీ గేమ్ ఆడించారు. అవినాష్ కోతిలా నటించి నవ్వులు పూయించాడు. నబీల్ జిరాఫీలా నటించాడు. లేటెస్ట్ ప్రోమో ఆసక్తిరేపుతుంది. మరోవైపు విన్నర్ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది.
12:11 PM (IST) Dec 11
ఫైనల్ వీక్ ని స్టార్ మా తమ సీరియల్స్ ని ప్రమోట్ చేసుకునే పనిలో ఉంది. ఆ ఛానల్ లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న సీరియల్స్ లో నటిస్తున్న మెయిన్ లీడ్స్ హౌస్లోకి వస్తున్నారు. కంటెస్టెంట్స్ తో సరదా గేమ్స్ ఆడుతున్నారు. తాజా ఎపిసోడ్లో మగువా ఓ మగువా సీరియల్ హీరో, హీరోయిన్ వచ్చారు.
06:47 AM (IST) Dec 11
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికర ముగింపు దిశగా వెళుతోంది. ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలేతో బిగ్ బాస్ 8 తెలుగు కి ఎండ్ కార్డు పడనుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కి మామగారు సీరియల్ నటులు ఆకర్ష్, సుహాసిని ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో ఉన్న సభ్యుల బ్రేకప్ స్టోరీలు అడిగి తెలుసుకున్నారు. గౌతమ్ తన కాలేజ్ బ్రేకప్ స్టోరీ గురించి చెప్పాడు. కాలేజ్ లో ఉన్నప్పుడు ఒకమ్మాయిని ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నా. నా ఫస్ట్ లవ్ స్టోరీ, రిలేషన్ షిప్ అదే. కొన్ని కారణాల వల్ల నా ఫస్ట్ లవ్ సక్సెస్ కాలేదు అని గౌతమ్ తెలిపాడు.