బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నిజంగానే రణరంగంలా తయారయ్యింది. బిగ్ బాస్ చెప్పినట్టుగానే హాట్ హాట్ గా నడుస్తోంది. ఎవప్పుడు ఎవరు మిత్రులు అవుతారో.. ఎవరు శత్రువులు అవుతారో తెలియడంలేదు. తాజా ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా జరిగాయి. అందులో రీతూ గురించి ఇమ్మాన్యుయెల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రీతూచౌదరీ రాముని తన కంట్రోల్‌లోకి తీసుకుందని, అతన్ని డామినేట్ చేస్తుందని, అందుకే ఆమె కోసం అతను చాలా విషయాల్లో త్యాగం చేసుకున్నాడు. వాడిని ఇలా నిల్చునేలా చేసింది. రీతూ క్షమించలేదని, ఆమెని తాను ఫ్రెండ్ అని అనుకోవడం లేదని ఇమ్ము అన్నాడు.
