బిగ్ బాస్ తెలుగు 8 నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలోకి అడుగు పెట్టింది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు టైమ్ వచ్చింది. యాంకర్ రవి పేరు కొత్తగా వినిపిస్తుంది. క్రేజీ కంటెస్టెంట్లని దించుతున్నారట బిగ్ బాస్.

08:26 PM (IST) Oct 01
ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ సారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్‌లో నిఖిల్, నైనిక, ఆదిత్య ఓం, మణికంఠ, విష్ణు ప్రియా, నబీల్ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి. అయితే ఆదిత్య ఓం పేరు బాగా వినిపిస్తుంది.
08:24 PM (IST) Oct 01
యష్మి ఇప్పటి వరకు ఫైరింగ్‌లోనే కనిపించింది. చాలా వరకు ఆమె సీరియస్‌గానే ఉంటుంది. కానీ ఇప్పుడు మారిపోయింది. తనలోని ఫన్ యాంగిల్ బయటపెట్టింది. అయితే ఆమె చూడ్డానికి సీరియస్‌గానే ఉన్నా, కామెడీగా మారడం విశేషం. నామినేషన్‌లో మణికంఠపై ఫైర్ అయ్యే ఆమె ఇప్పుడు ఆయనతోనే కాళ్ల భేరానికి వెళ్లింది.
08:10 PM (IST) Oct 01
బిగ్ బాస్ తెలుగు 8 30వ రోజు ఎపిసోడ్‌లో సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ గేమ్‌లో భాగంగా దీనికి ఎవరు అనార్హులో ప్రకటించాల్సి ఉండగా, కిర్రాక్ సీతని ప్రకటించారు నిఖిల్. దీనికి కోసం వీరి మధ్య పెద్ద డ్రామానే నడిచింది. మరోవైపు రోల్ బేబీ రోల్ గేమ్ సైతం ఇంట్రెస్టింగ్‌గా సాగింది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఇది ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.
05:15 PM (IST) Oct 01
బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి టైమ్ వచ్చింది. దాదాపు పది మంది కంటెస్టెంట్లు రాబోతున్నారని, మాజీ కంటెస్టెంట్లని తీసుకురాబోతున్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారికంగా ప్రకటిస్తున్నారు. టేస్టీ తేజ రాబోతున్నట్టు అధికారికంగానే హింట్ ఇచ్చారు.
03:21 PM (IST) Oct 01
టాస్క్ లలో ఎవరు పాల్గొనాలనే విషయం పై హౌస్ మేట్స్ మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ప్రేరణ వద్దు. ఆమె హెల్త్ బాగోలేదని మణికంఠ అన్నాడు. అయితే నా ఆరోగ్యం గురించి నీకెందుకని, ప్రేరణ ఫైర్ అయ్యింది. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ మరో టఫ్ టాస్క్ ఇచ్చాడు.
02:48 PM (IST) Oct 01
వైల్డ్ కార్డ్ ద్వారా మాజీ కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెడుతున్నారు అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ లిస్ట్ లో గంగవ్వ కూడా ఉందట. సీజన్ 4లో గంగవ్వ కంటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గంగవ్వ వద్దని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆమె రాకతో అందరి గేమ్ మారిపోతుంది. అలాగే గంగవ్వను ఎవరూ నామినేట్ చేయరని, సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
10:52 AM (IST) Oct 01
బిగ్ బాస్ తెలుగు 8 30వ వారం ప్రోమో బయటకు వచ్చింది. `తాళం విడిపించు టైర్‌ని నడిపించు` అనే టాస్క్ లో నిఖిల్ వేగంగా చేశాడు. చివర్లో మిస్ అయ్యింది. కానీ దీని మీద నబీల్ చెప్పిన లెక్క, చివరకి నిఖిల్‌కి మణికంఠ చెప్పిన వైల్డ్ కార్డ్ లెక్క మతిపోయేలా ఉంది. అదేంటో మీరూచూడండి. ప్రోమై వైరల్ అవుతుంది.
08:08 AM (IST) Oct 01
బిగ్ బాస్ తెలుగు 8లోకి ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గట్టిగానే ఉండబోతున్నాయట. ఎప్పుడూ లేని విధంగా సుమారు పది మంది మాజీ క్రేజీ కంటెస్టెంట్లని దించుతున్నారట. ఆ విశేషాలను కింద లింక్‌లో చూడండి.
వైల్డ్ కార్డ్ ద్వారా క్రేజీ కంటెస్టెంట్లు ఎంట్రీ, ఎంత మందో తెలిస్తే షాకే, ఇక హౌజ్‌మేట్స్ కి చుక్కలే!
07:10 AM (IST) Oct 01
బిగ్ బాస్ తెలుగు 8 నాలుగో వారంలో సోనియా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌజ్‌లో పది మందికంటెస్టెంట్లు ఉన్నారు. ఈ మిడ్ వీక్ లో మరొకరిని డైరెక్ట్ బిగ్ బాస్ ఎలిమినేట్ చేసేఅవకాశం ఉందట. అంతేకాదు వైల్డ్ కార్డు ఎంట్రీలకు టైమ్ స్టార్ట్ అయ్యిందట. ఈ వారంలోగానీ, వచ్చే వారంలోగానీ ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో యాంకర్ రవి పేరు ప్రధానంగా వినిపిస్తుంది.