బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ చివరి వారానికి చేరుకుంది. మరో ఐదు రోజుల్లో ఏకంగా షోనే పూర్తి కాబోతుంది. ఎవరు విన్నర్ అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఆదివారం ఎలిమినేట్ అయిన విష్ణు ప్రియ పృథ్వీరాజ్ శెట్టి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఆయన్ని ఆ విషయంలో ఫ్లర్ట్ చేసినట్టు తెలిపింది.

08:56 PM (IST) Dec 10
టైటిల్ కొడతామని నమ్మకం లేని వాళ్ళు రూ. 20 లక్షలు తీసుకుని మిడ్ వీక్ లో ఎలిమినేట్ కావచ్చని బిగ్ బాస్ ఆఫర్ చేస్తాడట, ఈ ఆఫర్ ని అవినాష్ తీసుకున్నాడని సమాచారం. అవినాష్ కి టైటిల్ కొడతానని కొంచెం కూడా నమ్మకం లేదు. 11వ వారం నబీల్ అవిక్షన్ షీల్డ్ వాడి సేవ్ చేశాడు. ఇక టికెట్ టు ఫినాలే గెలవడం వలన రెండు వారాలు నామినేషన్స్ లో లేకుండా నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు.
04:50 PM (IST) Dec 10
బిగ్ బాస్ హౌస్లోకి మామగారు ఫేమ్ సుహాసిని తన కో స్టార్ తో ఎంట్రీ ఇచ్చింది. వీరితో కంటెస్టెంట్స్ తమ జీవితంలోని బ్రేకప్ లవ్ స్టోరీస్ బయటపెట్టారు. ఇక సరదా గేమ్స్ తో కంటెస్టెంట్స్ వారిని ఎంటర్టైన్ చేశారు. లేటెస్ట్ ప్రోమో అదిరింది.
03:11 PM (IST) Dec 10
చివరి వారం బిగ్ బాస్ హౌస్లోకి పలువురు సెలెబ్స్ ఎంట్రీ ఇస్తున్నారు. సీరియల్ నటులు తమ ప్రాజెక్ట్స్ కి ప్రచారం కల్పించుకుంటున్నారు. ఈ క్రమంలో బ్రహ్మముడి కావ్య బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. ఆమె అల్లరి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.
08:36 AM (IST) Dec 10
విష్ణు ప్రియా ఈ ఆదివారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. పృథ్వీరాజ్‌తో లవ్ ట్రాక్ గురించి ఓపెన్ అయ్యింది. పెళ్లి వరకు వెళ్లినట్టుగా తెలిపి షాకిచ్చింది.
07:12 AM (IST) Dec 10
బిగ్ బాస్ తెలుగు 8 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో విష్ణ ప్రియా ఒకరు. పెద్దగా గేమ్ ఆడకపోయినా నెట్టుకుంటూ వచ్చింది. 14వ వారం వరకు ఉంది. అయితే హౌజ్‌లో ఉన్నంత సేపు పృథ్వీ చుట్టూ తిరిగింది. అంతేకాదు ఆయనతో ప్రేమ అంటూ వెంటపడింది. ఈ క్రమంలో ఆమె ఓవర్‌గా వెళ్లిపోయింది. ముద్దులు, హగ్గుల నుంచి పెళ్లి వరకు వెళ్లిందట.