Published : Sep 03, 2023, 07:05 PM ISTUpdated : Sep 03, 2023, 11:19 PM IST

Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌7 గ్రాండ్‌ లాంచ్‌.. హౌజ్‌లోకి నవీన్‌ పొలిశెట్టి.. ఇదేం షాక్‌

సారాంశం

వరల్డ్ వైడ్‌గా పాపులర్‌ అయిన బిగ్‌ బాస్‌ షో తెలుగులోనూ గత ఆరు సీజన్లుగా రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. స్టార్‌ మాలో ప్రసారమయ్యే ఈ రియాలిటీ షో నేడు ఆదివారం (సెప్టెంబర్‌ 3)న గ్రాండ్‌గా ప్రారంభమైంది. షో సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది.  

Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌7 గ్రాండ్‌ లాంచ్‌.. హౌజ్‌లోకి నవీన్‌ పొలిశెట్టి.. ఇదేం షాక్‌

10:27 PM (IST) Sep 03

బిగ్‌ ట్విస్ట్.. పదిహేనో కంటెస్టెంట్‌గా హీరో నవీన్‌ పొలిశెట్టి ఎంట్రీ..

బిగ్‌ బాస్‌ 7 సీజన్‌లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. గెస్ట్ గా వచ్చిన హీరో నవీన్‌ పొలిశెట్టిని కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి పంపించాడు. తాను హీరోగా `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అనుష్క హీరోయిన్‌. ఈ సినిమా సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వచ్చారు. కానీ ఆయన్ని హౌజ్‌లోకి పంపించడంతో నవీన్‌ సైతం ఆశ్చర్యపోయాడు. తాను నటించిన `జాతిరత్నాలు`లో రాయల్‌ విల్లాస్‌ అన్నపూర్ణ స్టూడియో పక్కన అని చెబుతాడు. ఆ డైలాగు గుర్తు చేశాడు నవీన్‌. ఇప్పుడు ఏకంగా అన్నపూర్ణ స్టూడియోలోనే ఉండటం ఆనందంగా ఉందన్నారు. మరోవైపు `మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రం ప్రారంభించేటప్పుడు అనుష్క 17ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్‌ కట్‌చేసినట్టు తెలిపారు. `సూపర్‌` మూవీతో అనుష్కని హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే కంప్లీట్ కంటెస్టెంట్లని ఇంకా పరిచయం చేయలేదనిపిస్తుంది. రేపు మరికొందరిని పరిచయంచేసే అవకాశం ఉంది. అది సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతుందని సమాచారం. మరి నవీన్‌ పొలిశెట్టిని ఎంత సేపు హౌజ్‌లో ఉంచుతారనేది ఆసక్తి కరంగా మారింది. 
 

10:19 PM (IST) Sep 03

పద్నాలుగో కంటెస్టెంట్‌ గా టీవీ నటుడు అమర్‌ దీప్‌ ఎంట్రీ

టీవీ నటుడు అమర్‌ దీప్‌ 14వ కంటెస్టెంట్‌గా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదిరిపోయే డాన్సు పర్‌ఫెర్మ్ తో ఆయన ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా ఆయన్ని నాగార్జున ప్రత్యేకంగా అభినందించాడు. అదేసమయంలో తన భార్య తేజూని చాలా మిస్‌ అవుతున్నట్టు చెప్పాడు అమర్‌ దీప్‌. 
 

10:12 PM (IST) Sep 03

పదమూడో కంటెస్టెంట్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎంట్రీ..

బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి రైతు బిడ్డ, యూట్యూబర్‌ పల్లవి ప్రశాంత్‌ పదమూడో కంటెస్టెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అవమానాలను అధిగమించి రైతుగా నిలబడ్డానని తెలిపారు. అమ్మానాన్నలకు అండగా నిలిచినట్టు తెలిపారు. అంతేకాదు రైతులకు సంబంధించిన విషయాలను యూట్యూబ్‌ ద్వారా చెబుతూ పాపులర్‌ అయ్యారు. కలర్‌ విషయంలో తాను ఎన్నో అవమానాలు ఫేస్‌ చేశానని, తాను ఎలాగైనా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వెళ్లాలని కష్టపడినట్టు తెలిపారు. అంతేకాదు నాగార్జున కోసం బియ్యం, మట్టి గిఫ్ట్ గా తీసుకొచ్చాడు. నాగ్‌ కూడా అతనికి మిర్చీ మొక్క ఇచ్చాడు. దాన్ని పెంచి కాయలు కాసేలా చేయలన్నారు. అలా చేస్తే చాలా బెనిఫిట్స్ ఇస్తానని పేర్కొన్నాడు. 
 

09:58 PM (IST) Sep 03

పన్నెండో కంటెస్టెంట్‌గా నటి కిరణ్‌ రాథోర్‌ ఎంట్రీ..

పన్నెండో కంటెస్టెంట్‌గా బిగ్‌ బాస్‌ హౌజ్‌ లోకి నటి కిరణ్‌ రాథోర్‌ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన ఆమె బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి రావడం విశేషం. తనకు ఈ మధ్య గ్యాప్ వచ్చిందని, తానేంటో నిరూపించుకునేందుకు, తన ప్రతిభని చూపించేందుకు బిగ్‌ బాస్‌ బెటర్‌ ప్లాట్‌ ఫామ్‌ అని భావించిన వచ్చినట్టు తెలిపింది కిరణ్ రాథోర్‌.

09:54 PM (IST) Sep 03

పదకొండో కటెస్టెంట్‌గా డాక్టర్‌ గౌతమ్‌ కృష్ణ ఎంట్రీ..

బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి పదకొండో కంటెస్టెంట్‌గా డాక్టర్‌ గౌతమ్‌ కృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన డాక్టర్‌ నుంచి యాక్టర్‌ అయ్యారు. చిన్నప్పట్నుంచి తనకు రైటర్‌, డైరెక్టర్‌ కావాలనుకున్నారట. కానీ పేరెంట్స్ స్టడీస్‌ చేయమని చెప్పడంతో చదువుకుని డాక్టర్‌ అయ్యాడట. కానీ తన ప్లాన్‌ బీ సినిమాలు. అలా డాక్టర్‌ అయ్యాడు యాక్టింగ్‌ సైడ్‌ వెళ్లాడట. హీరోగానూ నటించాడు. అయితే బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వెళ్లాక అందమైన అమ్మాయికి ప్రపోజ్‌ చేయాలని, అందుకు తనకు బేడీలు ఇచ్చి పంపించాడు నాగార్జున.

09:32 PM (IST) Sep 03

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ గెస్ట్ గా ఎంట్రీ..

బిగ్‌ బాస్‌  హౌజ్‌లోకి గెస్ట్ గా విజయ్‌ దేవరకొండ ఎంట్రీ ఇచ్చారు. `ఖుషి` చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయన వెళ్లారు. ఇందులో నాగార్జున సమంత గురించి అడగడం విశేషం. అంతేకాదు స్టేజ్‌పై వచ్చీ రానీ హిందీలో మాట్లాడి నవ్వించాడు. అంతేకాదు ఏకంగా విజయ్‌ని హౌజ్‌లోకి పంపించాడు నాగ్‌. ఆయన చేత కంటెస్టెంట్లని ఆట ఆడించనున్

09:24 PM (IST) Sep 03

పదో కంటెస్టెంట్‌గా హీరోయిన్ రతిక ఎంట్రీ..

బిగ్‌ బాస్‌ 7 హౌజ్‌లోకి హీరోయిన్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ రతిక పదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. తనకు నటిగా గుర్తింపు రావడం లేదు, ఐడెంటిటీ కోసం బిగ్‌ బాస్‌ లోకి వెళ్తున్నట్టు రతిక చెప్పింది. హౌజ్‌లో తన టాలెంట్‌ చూపిస్తానని పేర్కొంది. తన డన్సర్‌, ఇమిటేట్‌ ఆర్టిస్ట్ కూడా అని పేర్కొంది. అయితే తన హార్ట్ బ్రేక్‌ అయ్యిందని చెప్పాడు నాగ్‌. ఆమె లవ్‌ ఫెయిల్యూర్‌ అయ్యిందనే విషయాన్ని వెల్లడించడంతో ఆమె ఆశ్చర్యపోయింది. 
 

09:11 PM (IST) Sep 03

తొమ్మిదో కంటెస్టెంట్‌గా యూట్యూబర్‌ `టేస్టీ` తేజ ఎంట్రీ..

బిగ్‌ బాస్‌ 7 హౌజ్‌లోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా యూట్యూబర్‌ `టేస్టీ` తేజ ఎంట్రీ ఇచ్చారు. వంటల వీడియోలతో పాపులర్‌ అయ్యాడు తేజ. వంటకాలను టేస్టీ చేస్తూ వాటిని తన యూట్యూబ్ ద్వారా జనాలకు పరిచయం చేస్తాడు. ఆడియెన్స్ కి కూడా తనటేస్ట్ ని చూపిద్దామని బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చినట్టు చెప్పాడు. ఈ సందర్భంగా స్టేజ్‌పైనే తేజకి టాస్క్ ఇచ్చాడు నాగ్‌. ఆ టాస్క్ తో హౌజ్‌లోకి వెళ
 

08:57 PM (IST) Sep 03

ఎనిమిదో కంటెస్టెంట్‌గా `కార్తీకదీపం` నటి శోభా శెట్టి ఎంట్రీ..

బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా `కార్తీక దీపం` నటి శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే డాన్స్‌ పర్‌ఫెర్మ్ తో ఎంట్రీ ఇచ్చింది. అందంతో అదరగొట్టింది. కార్తీక దీపం సీరియల్‌లో మోనితగా ఆమె నెగటివ్‌ రోల్‌ చేసి మెప్పించింది. ఫిజికల్‌గా తాను ఎప్పుడూ ఫిట్‌గా ఉంటానని తెలిపింది. అంతేకాదు నాజూకు అందంతో ఆకట్టుకుంది. అయితే తనని టెలివిజన్‌ రమ్యకృష్ణ అని పిలిచేవారట. అలా తాను మెప్పించాలని కోరుకుంటున్నట్టు తలెఇపింది. ఆ కంప్లిమెంట్‌ ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. అయితే అందులోనే ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. హౌజ్‌లో ఎవరిచేత నువ్వు బ్యూటీఫుల్‌, హాట్‌ అనే కంప్లిమెంట్లు తీసుకోవద్దని, అలా కంప్లిమెంట్స్ వస్తే ఫనిష్‌మెంట్ ఇస్తానని తెలిపారు నాగ్‌. 

08:44 PM (IST) Sep 03

ఏడో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫ్‌ సందీప్‌ ఎంట్రీ..

బిగ్‌ బాస్‌ తెలుగు 7 రియాలిటీ షోలోకి ఏడో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్‌, డాన్సర్‌ సందీప్‌ ఎంట్రీ ఇచ్చారు. వారసుడు చిత్రంలోని దళపతి సాంగ్‌తో ఆయన బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆద్యంతం స్టయిలీష్‌ డాన్సుతో అదరగొట్టాడు. తన లైఫ్‌లో కొరియోగ్రాఫర్‌ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానని, కానీ తండ్రిగా ఉండటం గొప్ప ఫీలింగ్‌ అని తెలిపాడు సందీప్‌.
 

08:33 PM (IST) Sep 03

ఆరో కంటెస్టెంట్‌గా షకీలా ఎంట్రీ.. కన్నీటి గాథ..

బిగ్‌ బాస్‌ తెలుగు 7 రియాలిటీ షోకి శృంగార నటి షకీలా ఎంట్రీ ఇచ్చారు. ఆరో కంటెస్టెంట్‌గా ఆమె ఎంట్రీ ఇవ్వడం విశేషం.తన కన్నీటి గాథ చెబుతూ ఆమె ఏవీని చూపించారు. అనంతరం తన 25ఏళ్ల కెరీర్‌ ఒకటి,ఇప్పుడు ఒకటి అని, ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి దగ్గర కావాలని షోకి వచ్చినట్టు తెలిపింది. ఇప్పుడు షకీ అమ్మగా వచ్చినట్టు తెలిపింది. అంతేకాదు తాను దత్తత తీసుకున్న ఇద్దరు ట్రాన్స్ జెండర్లని పరిచయం చేశారు నాగ్. తమని సొంత అమ్మలా షకీలా ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా షకీలా కన్నీళ్లు పెట్టుకున్నారు. 25ఏళ్ల క్రితమే ఈ ఆలోచన వచ్చిందన్నారు. వారికి అమ్మ అవసరం ఉందని, అందుకే దత్తత తీసుకున్నట్టు తెలిపింది షకీలా.  

08:18 PM (IST) Sep 03

మొదటి ఐదు కంటెస్టెంట్లకి.. 35లక్షల ఆఫర్‌.. ఇదేం షాక్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 7 గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొదటి ఐదు కంటెస్టెంట్లుగా ప్రియాంక, శివాజీ, దామిని, యావర్‌, శుభ శ్రీ ఎంట్రీ ఇచ్చారు. వీరికి నాగార్జున మనీ ఆఫర్ ఇచ్చారు. హౌజ్‌ నుంచి వెళ్లిపోవడానికి ఆయన ఆఫర్‌ చేశారు. ఐదు లక్షలతో ప్రారంభించారు. పది లక్షలు, ఇరవై, 25, ముప్పై ఐదు లక్షల ఆఫర్‌ ఇచ్చారు. అయినా కంటెస్టెంట్లు తీసుకోలేదు. తాము ఆడటానికి వచ్చామని, వెళ్లడానికి కాదని స్పష్టం చేశారు. 

08:06 PM (IST) Sep 03

ఐదో కంటెస్టెంట్‌గా లాయర్‌, నటి శుభ శ్రీ ఎంట్రీ..

ఐదో కంటెస్టెంట్‌గా లాయర్‌, నటి శుభ శ్రీ రాయగురు ఎంట్రీ ఇచ్చారు. `చూసే చూసే.. ` అనే పాటతో పర్‌ఫెర్మ్ చేసి ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన డాన్సుతో అదరగొట్టింది. రెడ్‌ డ్రెస్‌లో ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఈమెకి కూడా కంటెస్టెంట్‌ ఫైనల్‌ కాలేదని, అర్హత సాధించాలని,అందుకు పవర్‌ అస్త్రాని గెలుచుకోవాలని తెలిపారు నాగార్జున.

07:53 PM (IST) Sep 03

నాల్గో కంటెస్టెంట్‌గా యావర్‌ ఎంట్రీ

బిగ్‌ బాస్‌ తెలుగు 7  కంటెస్టెంట్‌గా ఆర్టిస్టు యావర్‌ ఎంట్రీ ఇచ్చారు. తనదైన పర్‌ఫెర్మ్ తో అదరగొట్టాడు. అంతేకాదు షర్ట్ విప్పి హౌజ్‌లోకి వెళ్లడం విశేషం.

07:47 PM (IST) Sep 03

మూడో కంటెస్టెంట్‌గా స్టార్‌ సింగర్‌ దామిని ఎంట్రీ.. కానీ పెద్ద షాక్‌

మూడో కంటెస్టెంట్‌గా పాపులర్‌ సింగర్‌ దామిని ఎంట్రీ ఇచ్చింది. `ఎల్‌పచీనో..` అంటూ తనదైన స్టయిలీష్‌ సాంగ్‌తో ఆమె ఎంట్రీ ఇచ్చాడు. పాటలతో ఉర్రూతలూగించారు. దామినికి పెద్ద షాకిచ్చాడు నాగార్జున. ఆమె కంటెస్టెంట్‌గా ఇంకా ఫైనల్‌ కాలేదని, కంటెస్టెంట్‌ అయ్యే అర్హత సాధించాలన్నారు. పవర్‌ అస్త్రాని సొంతం చేసుకుంటే కంటెస్టెంట్‌గా ఛాన్స్ వస్తుందన్నారు. అలాగే హౌజ్‌లో ఒక ట్రెజర్‌ ఉందని, దాన్ని దక్కించుకుంటే దానిబెనిఫిట్స్ అన్ని వస్తాయని తెలిపారు. ఈ విషయం ఆమెకి మాత్రమే చెబుతున్నట్టుగా నాగ్‌ తెలియజేశారు. నాగ్‌ చెప్పిన దానికి పెద్ద షాక్‌ అయ్యింది.

07:35 PM (IST) Sep 03

సెకండ్‌ కంటెస్టెంట్‌గా నటుడు శివాజీ ఎంట్రీ..

బిగ్‌ బాస్‌ తెలుగు 7 షోకి రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన లైఫ్‌ కూడా ఉల్టా ఫుల్టా అయ్యిందని తెలిపారు శివాజీ. తన తొలి చెక్‌ నాగార్జున చేతుల మీదుగానే అందుకున్నానని, ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. తొలి సినిమాకి ఎక్స్ ట్రా రెమ్యూనరేషన్‌ ఇవ్వడంతో ల్యాండ్‌ కొన్నట్టు తెలిపారు శ కొత్త ఎక్స్ పీరియెన్స్ చేద్దామని తాను వచ్చినట్టు చెప్పాడు శివాజీ. 

07:10 PM (IST) Sep 03

ఫస్ట్ కంటెస్టెంట్‌గా టీవీ నటి ప్రియాంక ఎంట్రీ..

టీవీ నటి ప్రియాంక తొలి కంటెస్టెంట్‌గా బిగ్‌ బాస్‌ తెలుగు 7హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. `పొట్టి పిల్లా` అనే సాంగ్‌తో ఆమె కిర్రాక్‌ పర్‌ఫెర్మ్ చేసింది. అందరి మనసులు దోచుకుంది. ఇందులో ఆమె హౌజ్‌ని అందరికి పరిచయం చేయాలని ఆమెకి హోస్ట్ నాగార్జున తెలిపారు. ఆమె హౌజ్‌లోకి వెళ్లి అన్నింటిని చూపించే ప్రయత్నం చేసింది. కాకపోతే హౌజ్‌లో పెద్ద ట్విట్ట్ ఇచ్చాడు.  అన్ని కంటెస్టెంట్లు సాధిస్తేనే ఆయా సౌకర్యాలు అందుతాయని తెలిపారు. హౌజ్‌ మొత్తం ఎమ్టీ గా ఉంచారు.

అయితే నాగ్‌ ఫర్నీచర్‌తో ఎలా ఉంటుందో ప్రత్యేక వీడియో ద్వారా చూపించారు. ఈ సారి హౌజ్‌ సరికొత్తగా ఉంది. అదిరిపోయింది.