బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే సెర్మనీ గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్ విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ప్రశాంత్‌కి ట్రోఫీ అందించారు నాగార్జున. కామన్ మ్యాన్ నుంచి బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన ప్రశాంత్ చరిత్ర సృష్టించాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
10:45 PM (IST) Dec 17
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు. అమర్, ప్రశాంత్ మధ్య పోటీ నెలకొనగా, విన్నర్‌ని నాగార్జున నిర్ణయించారు. ఎన్నడూ లేని విధంగా కామన్ మ్యాన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావడం విశేషం.
10:28 PM (IST) Dec 17
ఇప్పటి వరకు అందరు కంటెస్టెంట్ల ఏవీలను చూపించిన బిగ్ బాస్.. ఇక ఫైనల్‌గా హోస్ట్ నాగార్జున ఏవీని ప్రదర్శించారు. ఆద్యంతం ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా సాగడం విశేష
10:24 PM (IST) Dec 17
ప్రస్తుతం హౌజ్‌లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఉన్నారు. వీరిని స్టేజ్‌పైకి తీసుకొచ్చేందుకు నాగార్జున హౌజ్‌లోకి వెళ్లారు. వారిద్దరికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పబోతున్నారు.
10:11 PM (IST) Dec 17
బిగ్ బాస్ తెలుగు 7 షో నుంచి మూడో స్థానంలో శివాజీ ఎలిమినేట్ అయ్యాడు. కళ్యాణ్ రామ్ ఎలిమినేషన్‌ని నిర్ణయించారు. శివాజీ ఎలిమినేట్ అయ్యాక హౌజ్‌కి దెండం పెట్టాడు. అంతేకాదు శివాజీ ఎలిమినేట్ అయ్యాక పల్లవి ప్రశాంత్ కన్నీళ్లు ప
10:05 PM (IST) Dec 17
కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కలిసి `డెవిల్` చిత్రంలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్‌కి వచ్చారు. చిత్ర ట్రైలర్ ప్రదర్శించారు. చిత్ర విశేష
09:50 PM (IST) Dec 17
బిగ్ బాస్ తెలుగు 7 వ సీజన్‌లో టాప్ 4లో యావర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఆఫర్ చేసిన 15 లక్షలు తీసుకుని ఆయన హౌజ్‌ని వీడారు. తమ సోదరుల అభిప్రాయం మేరకు యావర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు యావర్
09:37 PM (IST) Dec 17
నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ హీరోలుగా నటించిన ` నా సామి రంగా` చిత్రం ప్రమోషన్‌లో భాగంగా టీమ్ బిగ్ బాస్ షోకి వచ్చారు. టీజర్‌ని ప్రదర్శించారు. చిత్ర విశేషాలను తెలిపారు దర్శకుడు. చివరికి అల్లరి నరేష్, రాజ్ తరుణ్ గోల్డెన్ సూట్‌కేసుతో హౌజ్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం హౌజ్‌లో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్ ఉన్నారు. వీరిలో ఒకరిని బయటకు తీసుకురాబోతున్నారు. డబ్బుకి టెంప్ట్ అవుతారా?
09:19 PM (IST) Dec 17
మాస్ మహారాజా రవితేజ హౌజ్‌లోకి వచ్చి సందడి చేశాడు. వెళ్తూ వెళ్తూ ఎలిమినేషన్ చేశాడు. టాప్ 5లో ఉన్న ప్రియాంక జైన్‌ని ఎలిమినేట్ చేశ
09:13 PM (IST) Dec 17
బిగ్ బాస్ హౌజ్‌లోకి మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ ఇచ్చారు. `ఈగల్` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సందర్భంగా అమర్.. రవితేజ ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. రవితేజ సినిమాలో ఆఫర్ అనగానే హౌజ్‌ని వీడేందుకు సిద్ధ
09:01 PM (IST) Dec 17
ఎక్స్ హౌజ్ మేట్స్ కి వారి లక్షణాలు, వారి అలవాట్లని బట్టి అవార్డులు ఇచ్చారు నాగ్. అయితే ఇందులో అర్జున్‌కి స్పెషల్ అవార్డు దక్కింది. తన భార్య ప్రెగ్నెంట్‌తో ఉన్న నేపథ్యంలో టీషర్ట్ పై చిన్నారి స్కాన్‌ని ఫోటో ప్రింట్ తీయించి గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో అర్జున్‌తోపాటు ఆయన భార్య కూడా ఎమోషనల్
08:33 PM (IST) Dec 17
టాప్ 6 కంటెస్టెంట్ల నుంచి అర్జున్‌ని ఎలిమినేట్ చేసిం
08:32 PM (IST) Dec 17
హౌజ్‌లో ఉన్న ఆరుగురు సభ్యుల నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయడానికి యాంకర్ సుమ లోపలికి వెళ్లింది. ఎవరిని తీసుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమె చివర్లో ట్విస్ట్ ఇచ్చింది. రోబోని తీసుకొచ్చి, దాని ద్వారా ఎలిమినేషన్ చేయించింది.
08:26 PM (IST) Dec 17
బిగ్ బాస్ తెలుగు 7 షోలోకి యాంకర్ సుమ, తన కొడుకుతోపాటు వచ్చింది. సుమ కొడుకు రోషన్ `బబుల్ గమ్` చిత్రంలో నటించారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కాసేపు మెరిశారు. ఈ సందర్భంగా నాగ్, సుమ మధ్య ఫన్నీ కన్వర్జేషన్
08:20 PM (IST) Dec 17
బిగ్ బాస్ షోలో ట్రోఫి విన్నింగ్ కోసమే కంటెస్టెంట్లు పోరాడుతుంటారు. ఈ ఏడో సీజన్ బిగ్ బాస్ ట్రోఫీ ఎలా ఉంటుందో చూపించారు నాగార్జున
08:01 PM (IST) Dec 17
చాలా రోజుల తర్వాత ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌ని ఊపేసింది. తన దైన మాస్ డాన్సు పర్‌ఫెర్మెన్స్ లతో ఉర్రూతలూగించింది. ఈవెంట్‌కి కొత్త ఊపు తీసుకొచ్చింది.
07:58 PM (IST) Dec 17
ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న టాప్ 6 కంటస్టెంట్లు విన్నింగ్ స్పీచ్ ఇవ్వాలని చెప్పారు నాగార్జున. దీంతో ఒకరిలా మరొకరు చేసి చూపించాల్సి ఉంటుంది. ఇందులో వారి స్పీచ్‌లు ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగాయి.
07:48 PM (IST) Dec 17
బిగ్ బాస్ ఏడో సీజన్ పూర్తి షో ఏవీ చూపించారు నాగార్జున. ఇది ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. నవ్వించింది. ఏడిపించింది. దీంతో అది చూసిన టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నారు. బ్యూటీఫుల్ జర్నీ అంటూ ఆయన ఎమోషనల్
07:36 PM (IST) Dec 17
ఓ వైపు ఎలిమినేట్ అయిన డాన్సు పర్‌ఫెర్మెన్స్ లే కాదు, హౌజ్‌లో టాప్ 6 లో ఉన్న హౌజ్ మేట్స్ కూడా డాన్సు పర్‌ఫెర్మెన్స్ లతో ఉర్రూతలూగించారు. యావర్, శివాజీ, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, అర్జున్, అమర్ దీప్‌లు తమదైన పాటలతో డాన్సులు చేసి మెప్పించారు. ఫినాలేకి మరింత ఊపు తీసుకొచ
07:32 PM (IST) Dec 17
బిగ్ బాస్ షోలో భోలే ఫన్నీ వీడియో చూపించాడు నాగార్జున. అంతా టెన్షన్ గా ఉన్నారని, రిలీఫ్ కోసం ఓ ఫన్నీ వీడియో చూపించారు. ఇందులో భోలే ఓ టాస్క్ కోసం రెడీ అయ్యే క్రమంలో మైక్‌ని తనకు చుట్టుకునేందుకు ఇబ్బంది పడే వీడియో హిలేరియస్‌గా నవ్వులు పూయించింది. దీంతో ఈవెంట్ మొత్తం నవ్వులు విరిసాయి. ఈ సందర్భంగా మరోసారి భోలే చేసి చూపించాడు. అంతేకాదు తన కెరీర్ బాగుందని, కంటెస్టెంట్లతో పాటని షూట్ చేసినట్టు చెప్పారు. మరో పాట పాడి
07:25 PM (IST) Dec 17
ముందు తాము ఎవరికీ తెలియమని, ఇప్పుడు తాము లక్షల మందికి తెలిశామని ఆనందం వ్యక్తం చేశారు పల్లవి ప్రశాంత్ పేరెంట్స్. తమకు ఇది ఏం తెలియదని, ఇప్పుడు తమని చూసేందుకు అందరు వస్తున్నారని, పొలం పనులు చేసుకోనివ్వడం లేదన్నారు. ఇంతటి పేరు రావడం ఆనందంగా ఉందని వారు ఎమోషనల్ కామెంట్స్ చేశ
07:23 PM (IST) Dec 17
బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చాక తమ లైఫ్ మారిపోయిందన్నారు కంటెస్టెంట్లు. దామిని, అశ్విని, శోభా శెట్టి, శుభ శ్రీ వంటి వారు తమ ఆనందాన్ని వెళ్లడించారు. తనకు యానిమల్ సినిమాకి కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చిందని, సినిమా ఆఫర్లు వస్తున్నాయని సందీప్ మాస్టర్ తె
07:13 PM (IST) Dec 17
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ తర్వాత తన లైఫ్ మారిపోయిందన్నారు టేస్టీ తేజ. తనకు 15 సినిమా ఆఫర్లు వచ్చాయన్నారు. అంతేకాదు అంతకు ముందు తాను సంపాదించింది ఓ ఎత్తైతే, ఈ ఆరువారాల్లో దాన్ని మించి సంపాదించాను అని తెలిపారు. తన డాన్సు బాగా పాపులర్ అయ్యిందని చెప్పారు.