Bigg Boss Telugu 10: దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్‌ త్రిగుణ్ పై అపూర్వ ఫైర్.. రోజు రోజుకి పెరుగుతున్న రచ్చ..

Published : Oct 01, 2026, 11:34 PM IST
Bigg Boss Telugu 10 High Drama

సారాంశం

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలగు సీజన్ 10 చాలా డిఫరెంట్ గా నడుస్తోంది. గత సీజన్ల కంటే భిన్నంగా ఈ సారి ప్లాన్ చేశారు. ఈక్రమంలో తాజా ఎపిసోడ్ లో త్రిగుణ్, అపూర్వ మధ్య గట్టిగానే వార్ నడిచింది. ఇంతకీ ఏమయ్యిందంటే?

దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్‌:

బిగ్‌బాస్ రియాలిటీ షోలో నాల్గవ వారం పోటీలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇంట్లోని సభ్యులను రెండు గ్రూప్ లు గా విభజించిన బిగ్‌బాస్ యాజమాన్యం, వారి మధ్య ఆధికత్య పోరు కోసం కఠినమైన టాస్క్‌లను నిర్వహిస్తోంది. భైరవ నాయకత్వంలోని రెడ్ టీమ్ పోటీలో ముందంజలో సాగుతుండగా, సభ్యుల మధ్య వ్యూహాలు, వివాదాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి

మహిళల ప్రత్యేక టాస్క్:

తాజా ఎపిసోడ్‌లో భాగంగా ‘సైల్ టూ డామినేషన్’ అనే ఆసక్తికరమైన గేమ్ నిర్వహించారు. ఈ ఆట నియమాల ప్రకారం కేవలం మహిళా కంటెస్టెంట్లు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. రెడ్ టీమ్ తరఫున వర్షిణి, అపూర్వ పోటీపడగా, బ్లూ టీమ్ నుండి దేబ్జానీ ,సృష్టి రంగాంలోకి దిగారు. చక్రాలు ఉన్న ఒక చిన్న పడవ తరహా అమరికపై వీరంతా కూర్చుని, నిర్దేశిత డ్రమ్స్ వద్ద ఉన్న కర్రలకు తమ జట్టు జెండాలను వేగంగా అతికించాల్సి ఉంటుంది

సంచాలక్ వివాదం - అపూర్వ డిస్ క్వాలిఫై

గేమ్ మొదలైన కొద్దిసేపటికే తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో అపూర్వ పడవపై నుండి కిందపడిపోయింది. సంచాలక్‌గా వ్యవహరిస్తున్న త్రిగుణ్ తక్షణమే స్పందించి, రూల్స్ ప్రకారం అపూర్వను ఆట నుండి డిస్ క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటించాడు. త్రిగుణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇంట్లోని మిగతా సభ్యులకు పెద్ద షాక్‌గా మారింది. రాంప్రసాద్, రోహిత్ వంటి సభ్యులు సంచాలక్ తీరును బహిరంగంగానే తప్పుపట్టారు. తనను ఆట నుంచి తీసివేయడంతో అపూర్వ తీవ్రంగా స్పందించింది. తనపై ఉన్న వ్యక్తిగత పగతోనే త్రిగుణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆమె ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగింది. సంచాలక్ నిర్ణయమే అంతిమమని త్రిగుణ్ స్పష్టం చేయడంతో వివాదం మరింత రాజుకుంది.

నాన్ వెజ్ తినకపోవడం వల్లే..?

ఇంటి సభ్యుల ఒత్తిడి మేరకు త్రిగుణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అపూర్వను తిరిగి ఆటలోకి అనుమతించాడు. దాంతో ఆట మళ్లీ స్టార్ట్ అయ్యింది. ఆటలో బ్లూ టీమ్ సభ్యులైన సృష్టి, దేబ్జానీ అద్భుతమైన ప్రతిభ కనబరిచి తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఓటమిని తట్టుకోలేకపోయిన అపూర్వ ఎమోషన్ కు గురై ఏడ్చేసింది తనకు శారీరక బలం సరిపోలేదని, నాన్-వెజ్ తినకపోవడం వల్లే బలం లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో సరదా వాతావరణాన్ని కూడా సృష్టించాయి. ఏది ఏమైనా, రోజురోజుకూ మారుతున్న ఈ సమీకరణాలు, నామినేషన్లు మరియు టాస్క్‌ల గొడవలు బిగ్‌బాస్ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hanuman Ansh: 55 రోజుల్లో 420 కోట్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న హనుమాన్ అన్ష్
అరెరె.. ఈ పవన్ కల్యాణ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? 44 ఏళ్ల వయసులో ఏం చేస్తోందంటే?