బిగ్ బాస్ షోలో నటి సూసైడ్ ప్రయత్నం!

Published : Aug 19, 2019, 09:28 AM IST
బిగ్ బాస్ షోలో నటి సూసైడ్ ప్రయత్నం!

సారాంశం

తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌ లో హాస్య నటి మధు మిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళంలో ఒరుకల్‌ ఒరు కన్నాడీ చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పోటీ చేస్తున్నారు.   

తమిళ బిగ్ బాస్ మూడో సీజన్ మొదలైనప్పటి నుండి ఏదొక వివాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఇప్పటికే ఓ నటుడిని హౌస్ నుండి బయటకి పంపేశారు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న హాస్యనటి మధుమితని కూడా హౌస్ నుండి బయటకి పంపించేశారు.

వివరాల్లోకి వెళితే.. తమిళంలో ఒరుకల్‌ ఒరు కన్నాడీ చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పోటీ చేస్తున్నారు. దాదాపు యాభై రోజులకు పైగా హౌస్ లో ఉన్న మధుమిత కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తోన్న సమయంలో శనివారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

దీంతో ఆమెని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి పంపేశారు. హౌస్ లో కవిన్ అలానే మిగిలిన కొందరి మధ్య జరిగిన వాదనల కారణంగా మధుమిత సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే హోస్ట్ కమల్ హాసన్.. మధుమిత చేసిన చర్యపై మండిపడ్డారు. హౌస్ లో మధుమిత బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగిలిందని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌
Karthika Deepam 2 Latest Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- సీరియస్ అయిన శివన్నారాయణ, సుమిత్ర