తల్లి కాబోతున్న బిగ్ బాస్ భామ

Published : Dec 05, 2020, 08:55 PM IST
తల్లి కాబోతున్న బిగ్ బాస్ భామ

సారాంశం

హరితేజ బిగ్ బాస్ సీజన్ వన్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా సాగిన సీజన్ వన్ లో చాలా కాలమే కొనసాగింది హరితేజ. అప్పటి వరకు  సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్ షో ద్వారా దక్కించుకుంది. అప్పటి నుండే హరితేజకు వెండితెరపై అవకాశాలు రావడం జరిగింది.   

బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన హరితేజ, ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. అ ఆ, ప్రతిరోజూ పండగే వంటి చిత్రాలలో ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మధ్య విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ హిట్ మూవీలో హరితేజ కీలక రోల్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రంలో హరితేజ రోల్ ఆసక్తిగా సాగుతుంది.

 కాగా హరితేజ ప్రస్తుతం పలు సీరియల్స్ తోపాటు, బుల్లితెర షోలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఐతే హరితేజ ప్రస్తుతం గర్భవతి అని సమాచారం. అందుకే హరితేజ సీరియల్స్, సినిమాలు మరియు ఈవెంట్స్ కొంచెం బ్రేక్ ఇచ్చారట. త్వరలోనే హరితేజ పండంటి బిడ్డకు జన్మనివ్వనుందని సమాచారం.

 హరితేజ బిగ్ బాస్ సీజన్ వన్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా సాగిన సీజన్ వన్ లో చాలా కాలమే కొనసాగింది హరితేజ. అప్పటి వరకు  సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్ షో ద్వారా దక్కించుకుంది. అప్పటి నుండే హరితేజకు వెండితెరపై అవకాశాలు రావడం జరిగింది. 

PREV
click me!

Recommended Stories

20 ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూసి.. తెలుగులో కనిపించకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Bigg Boss 9 Telugu: షాకింగ్ ట్విస్ట్... ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ విన్నర్ రేసులోకి..