బిగ్‌ బాస్‌లో రొమాన్స్ మొదలైంది.. దివికి లైన్‌ వేస్తున్న మాస్టర్!

By Satish ReddyFirst Published Sep 11, 2020, 4:32 PM IST
Highlights

నిన్నటి ఎపిపోడ్‌తో దివికి మంచి ఫాలోయింగ్ పెరిగింది. దీంతో హౌస్‌మేట్స్ కూడా దివితో కలివిడిగా కనిపిస్తున్నారు. హౌస్‌లో సీనియర్‌ సభ్యులు సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్‌లు దివికి సైట్‌ కొడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ రోజు ఎపిసోడ్‌లో అమ్మ రాజశేఖర్‌ దివితో కలిసి వంట చేస్తూ ఆమెను ఫ్లర్ట్ చేస్తున్నట్టుగా ఉంది.

మొదటి రెండు రోజులు కాస్త బోరింగ్‌గా అనిపించినా ఫైనల్‌గా బిగ్‌ బాస్‌ లో అసలు మజా మొదలువుతోంది. నాలుగో రోజు తొలి  ఫిజికల్‌ టాక్స్‌ ఇచ్చిన బిగ్ బాస్‌ టీం తాజాగా మరింత మసాలా దిశగా దూసుకుపోతోంది. ఇన్నాళ్లు అసలు హౌస్‌లో ఉందా లేదా అన్న రేంజ్‌లో సైలెంట్‌గా ఉన్న దివి, ఇప్పుడు ఒక్కసారిగా సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. నిన్నటి షోలో హౌస్‌మేట్స్ గురించి అభిప్రాయం చెప్పటంతో పాటు టమాటా జ్యూస్‌ టాస్క్‌లోనూ యాక్టివ్‌గా పాల్గొంది దివి.

నిన్నటి ఎపిపోడ్‌తో దివికి మంచి ఫాలోయింగ్ పెరిగింది. దీంతో హౌస్‌మేట్స్ కూడా దివితో కలివిడిగా కనిపిస్తున్నారు. హౌస్‌లో సీనియర్‌ సభ్యులు సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్‌లు దివికి సైట్‌ కొడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ రోజు ఎపిసోడ్‌లో అమ్మ రాజశేఖర్‌ దివితో కలిసి వంట చేస్తూ ఆమెను ఫ్లర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. మంచి క్యారెక్ట‌ర్‌, అందం ఉంది, మ‌నంద‌రితో బిగ్‌బాస్‌లో ఉంది. నువ్వు హీరోయిన్‌, నేను హీరో.. స‌రేనా` అంటూ బిస్కెట్‌లు వేస్తున్నాడు అమ్మ రాజశేఖర్‌.

దివి తనకు వంట చేసే అబ్బాయిలు అంటే ఇష్టమని చెప్పటంతో సిగ్గుపడిపోయాడు అమ్మా రాజశేఖర్‌ మాస్టర్‌. దివిని  చూస్తూ పొరపాటున కూరలో టీ పోడి వేసేశాడు. నిన్నటి వరకు ఏ మాత్రం ఇంపార్టెన్స్‌ లేని దివి.. ఇప్పుడు ఒక్కసారిగా స్టార్‌ కంటెస్టెంట్‌గా మారిపోవటంతో సోషల్ మీడియాలో కూడా ఆమె మారుమోగిపోతోంది.

Ammai influence tho cooking fasak!!! Today at 9:30 PM on pic.twitter.com/0ohk7xopEg

— starmaa (@StarMaa)
click me!