నాగార్జున చేతిపై టాటూ.. దానర్ధం ఏంటో తెలుసా..?

Published : Sep 09, 2019, 01:01 PM IST
నాగార్జున చేతిపై టాటూ.. దానర్ధం ఏంటో తెలుసా..?

సారాంశం

ఆదివారం నాడు ప్రసారమైన బిగ్ బాస్ షోలో నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలో నాగార్జున చేతిపై ఉన్న టాటూ కథను చెప్పాలని నాని కోరారు.  

కింగ్ నాగార్జున ట్రెండ్ కి తగ్గట్లు తనను తాను మలుచుకుంటూ ఉంటాడు. ఇటీవల 'మన్మథుడు 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్ ప్రస్తుతం 'బిగ్ బాస్ 3'కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం నాడు ప్రసారమైన బిగ్ బాస్ షోలో నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చారు.

ఈ క్రమంలో నాగార్జున చేతిపై ఉన్న టాటూ కథను చెప్పాలని నాని కోరారు. హౌస్ మేట్స్ కూడా అడగడంతో నాగార్జున తన ఎడమ చేతిపై ఉన్న దిక్చూచి, నాగుపాము కాంబినేష‌న్‌లో ఉన్న టాటూని చూపిస్తూ దానికి వివ‌ర‌ణ ఇచ్చారు.

''నాగుపాము కుబుసాన్ని విడిచిపెడుతుంది. నేను కూడా గతాన్ని గురించి అసలు పట్టించుకోను. దానిపైన ఉన్న కన్ను నాదే. జీవితంలో కొత్త విషయాలను వెతుక్కుంటూ  ఉంటానన్న గుర్తుకు కన్ను బొమ్మ. కంపాస్(దిక్సూచి)పైన ఉన్న 'ఎన్' అనే అక్షరం ఉత్తర దిక్కు కావొచ్చు లేదా నా పేరు కూడా కావొచ్చు. చివరిగా సంతోషం అనేది గుండెల్లోనే ఉంటుందని చెప్పడం దీనర్ధం'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ షోలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిననాని తన 'గ్యాంగ్ లీడర్' సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చాడు. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవి కాదు, బాలకృష్ణే నెంబర్ 1.. ఆయన నిజస్వరూపం ఇదే, కానీ అందరి ముందు బయటపడరు
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌