
నందమూరినటసింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. కుర్రకారును మించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు బాలయ్య. వరుస సినిమాలతో సక్సెస్ ను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నాడు బాలకృష్ణ. అఖండ సినిమా తరువాత అదే ఉత్సాహంతో వీరసింహారెడ్డి సినిమా చేసిన బాలకృష్ణకు ఈసినిమాతో మరో సక్సెస్ లభించింది. దాంతో అదే ఊపుతో అనిల్ రావిపూడితో భగవంత్ సింగ్ కేసరి సినిమా చేస్తున్నాడు బాలయ్య.
భగవంత్ కేసరి సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే. మరీ ముఖ్యంగా బాలయ్య చెప్పిన హిందీ డైలాగ్ కు పూనకాలతో ఊగిపోయారు ఫ్యాన్స్. ఈ సినిమా గురించి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదరు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రంమలో ఈమూవీ షూటింగ్ చాలా వరకూ అయిపోయింది. అయితే చివరిగా పాటలు మాత్రమే మిగిలినట్టు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం 'భగవంత్ కేసరి' మూవీ కోసం మేకర్స్ భారీ సెట్‌ని నిర్మించినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాలో మెయిస్ కాస్ట్ అంతా కలిసి చేసే పాటను ఈ సెట్ లో షూట్ చేయబోతున్నారట టీమ్. అంతే కాదు నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో తన అన్ స్టాపబుల్ ఎనర్జీతో డ్యాన్స్ ఫ్లోర్‌ని ఊపేయనున్నాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాలయ్యతో పాటు కాజల్ అగర్వాల్, శ్రీలీల కూడా ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నట్టు తెలుస్తోంది.
భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ షూటింగ్‌ని ఆపకుండా చిత్ర బృందం వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పాటలో బాలయ్య ఎనర్జీ, శ్రీలీల అదరగొట్టే డ్యాన్స్, కాజల్ అందం చూస్తున్నా కొద్దీ చూడాలనిపించే విధంగా ఉంటుందని కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈసెట్ ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు కాగా, వి వెంకట్ యాక్షన్ పార్ట్ కొరియోగ్రఫీ చేశారు. థమన్ బాలయ్య కోసం అదరిపోయే ట్యూన్స్ రెడీ చేస్తున్నాడు.
అయితే ఈ సినమాలో బాలయ్య కూతురి పాత్రలో క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ బాలయ్యతో రొమాన్స్ చేయనుంది. బాలయ్య ఈసారి తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ కనిపించనున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్ ద్వారా బాలకృష్ణ తన రేంజ్ యాక్టింగ్‌ని ప్రదర్శిస్తాడని చాలా మంది భావిస్తున్నారు. కాగా ఈసినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు టీమ్.