బెల్లంకొండ శ్రీనివాస్ తో సమంత రొమాన్స్!

Published : Feb 05, 2019, 10:55 AM IST
బెల్లంకొండ శ్రీనివాస్ తో సమంత రొమాన్స్!

సారాంశం

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు సరైన హిట్టుని అందుకోలేకపోయాడు. కానీ అతడికి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటివరకు సరైన హిట్టుని అందుకోలేకపోయాడు. కానీ అతడికి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. తన ప్రతి సినిమాలో టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసే ఈ హీరో ప్రస్తుతం 'సీత' అనే సినిమాలో నటిస్తున్నాడు.

తేజ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు తాజాగా మరో సినిమా ఓకే చేశాడు బెల్లంకొండ. 'RX100'చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ కి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'అల్లుడు శ్రీను' సినిమా వచ్చింది. ఇప్పుడు మరోసారి సమంతతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ హీరో.

ప్రస్తుతం దర్శకనిర్మాతలు సమంతతో చర్చలు జరుపుతున్నారు. అవి కొలిక్కి వచ్చిన తరువాత వచ్చే వారంలో దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ చేయనున్నారు. భారీ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. 

PREV
click me!

Recommended Stories

Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌