సీత అంటూ.. బెల్లకొండ కొత్త రూట్?

Published : Jan 25, 2019, 07:50 PM IST
సీత అంటూ.. బెల్లకొండ కొత్త రూట్?

సారాంశం

సక్సెస్ అనేది ఎంత అవసరమో సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరిని అడిగినా చెబుతారు. అయితే బెల్లంకొండ వారసుడు శ్రీనివాస్ మాత్రం అందుకు భిన్నంగా చెప్పకనే చెబుతున్నాడు

సక్సెస్ అనేది ఎంత అవసరమో సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరిని అడిగినా చెబుతారు. అయితే బెల్లంకొండ వారసుడు శ్రీనివాస్ మాత్రం అందుకు భిన్నంగా చెప్పకనే చెబుతున్నాడు. నాకైతే హిట్టుతో సంబంధం లేదని వరుసగా మినిమమ్ బడ్జెట్ ఉన్న సినిమాలను వదులుతున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా కమర్షియల్ హిట్టు మాత్రం అందడం లేదు. 

ఇక ఎన్నిరోజులని సక్సెస్ లేకుండా సినిమాలు చేస్తాం అనుకున్నాడో ఏమో గాని ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. కాజల్ కి డిమాండ్ ఎక్కువవ్వడంతో తేజ డైరెక్షన్ లో చేస్తోన్న సినిమాకు హీరోయిన్ పాత్ర నేమ్ వచ్చేలా టైటిల్ సెట్ చేసుకున్నాడు. సీత అనే సినిమా ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ రేపు రిలీజ్ చేయబోతోంది. 

మొన్నటివరకు ఈ టైటిల్ పై రూమర్స్ వచ్చినప్పటికీ నేడు చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేయడంతో క్లారిటీ వచ్చింది. మొత్తానికి బెల్లంకొండ వారసుడు ఈసారి తన సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు ప్రాముఖ్యత ఎక్కువగా ఇస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి ఈ రూట్ లో అయినా ఈ క్యాష్ పార్టీ సన్ హిట్టందుకుంటాడో లేదో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు