ట్విట్టర్‌కి గుడ్‌బై.. బండ్ల గణేష్‌ సంచలన నిర్ణయం.. వివాదాలకు దూరంగా అంటూ..

Published : Aug 15, 2021, 09:07 AM IST
ట్విట్టర్‌కి గుడ్‌బై.. బండ్ల గణేష్‌ సంచలన నిర్ణయం.. వివాదాలకు దూరంగా అంటూ..

సారాంశం

రాజకీయాల్లోనూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బండ్ల గణేష్‌ ఇప్పుడు సినిమాల్లో నటుడిగా బిజీ అవుతున్నారు.  ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ కి గుడ్‌బై చెప్పేస్తానని ప్రకటించారు. 

బండ్ల గణేష్‌ అంటే సంచలనాలకు కేరాఫ్‌. ఆయన మాట్లాడే ప్రతి మాట ఓ సంచలనమే. ఆయన చేసే పని సంచలనమే. పవన్‌ కళ్యాణ్‌ భక్తుడిగా ఆయన స్టేజ్‌పై మాట్లాడితే అదో సంచలనం. తన బోల్డ్ స్పీచ్‌లతో కడుపుబ్బ నవ్వించడంలోనూ ఆయన సంచలనం  సృష్టిస్తారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కమెడీయన్‌గా రాణిస్తూ, ఉన్నట్టుండి నిర్మాతగా మారి స్టార్‌ హీరోలతో భారీ సినిమాలు నిర్మించి సంచలనం సృష్టించారు. రాజకీయాల్లోనూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బండ్ల గణేష్‌ ఇప్పుడు సినిమాల్లో నటుడిగా బిజీ అవుతున్నారు. 

ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ కి గుడ్‌బై చెప్పేస్తానని ప్రకటించారు. శనివారం ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు, అందుకే ట్విట్టర్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. `త్వరలోనే ట్విట్టర్‌ కి గుడ్‌బై చెప్పేస్తా. నాకు ఎలాంటి వివాదాలు వద్దు. నా జీవితంలో వివాదాలకు తావివ్వకుండా జీవించాలనుకుంటున్నా` అని ట్వీట్‌ చేశారు బండ్ల గణేష్‌. దీంతో ఆయన అభిమానులు షాక్‌కి గురయ్యారు. సోషల్‌ మీడియాలో ఇలాంటివి కామనే అన్నా, లైట్‌ తీస్కో అంటూ ఆయన్ని సముదాయించే పనిలో పడ్డారు. అదే సమయంలో `ఎందుకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏమైందో చెప్పండి` అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. మరి ఆ కారణం ఏంటో బండ్ల గణేష్‌ ఎప్పుడు రివీల్‌ చేస్తాడో చూడాలి. 

ప్రస్తుతం నటుడిగా బిజీ అవుతున్నాడు బండ్ల గణేష్‌. `సరిలేరు నీకెవ్వరు`లో మరోసారి తనదైన కామెడీతో మెప్పించారు. ఇప్పుడు `క్రేజీ అంకుల్స్` చిత్రంలో ప్రొడ్యూసర్‌ రోల్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అక్కడ కూడా తన రియల్‌ లైఫ్‌ స్టయిల్‌ని చూపించారు బండ్ల గణేష్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Couple Friendly Box Office: `కపుల్‌ ఫ్రెండ్లీ` మూవీ బాక్సాఫీసు కలెక్షన్లు.. రెండో రోజు పెరిగిన వసూళ్లు
Box Office Clash: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్, ఈ వారం థియేటర్లలో ఏకంగా 21 సినిమాలు రిలీజ్