చీప్ హోటల్ లో బాలయ్య కోసం రూమ్!

Published : Sep 02, 2019, 12:06 PM ISTUpdated : Sep 02, 2019, 01:38 PM IST
చీప్ హోటల్ లో బాలయ్య కోసం రూమ్!

సారాంశం

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెయస్ రవికుమార్ దర్శకత్వంలో #NBK105 చిత్రంలో నటిస్తున్నారు.  ఈ సినిమాకు 'రూలర్'.. 'క్రాంతి' అనే పేర్లను పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకూ టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు.   

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ థాయ్ లాండ్ లో జరిగింది. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ, హీరోయిన్ సోనల్ లపై ఓ పాటను చిత్రీకరించారు. అయితే ఈ 
షెడ్యూల్ లో హీరో బాలకృష్ణ, దర్శకుడు రవికుమార్ అప్సెట్ అయినట్లు సమాచారం.

నిర్మాత సి.కళ్యాణ్ టీం చిత్రబృందం అందరికీ థాయ్ లాండ్ లో ఒక హోటల్ లో అందరికీ రూమ్స్ బుక్ చేశారట. లైట్ బాయ్ నుండి హీరో, డైరెక్టర్ వరకూ అందరికీ ఒకే హోటల్ బుక్ చేయడంతో దర్శకుడి ఈగో హర్ట్ అయినట్లు సమాచారం. దీంతో ఆయన షూటింగ్ జరుగుతున్నన్ని రోజులూ తన అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారట.

నిజానికి బాలకృష్ణ లాంటి స్టార్లు స్టే చేయడానికి నిర్మాతలు లగ్జరీ హోటల్స్ బుక్ చేస్తుంటారు. కానీ సి.కళ్యాణ్ చీప్ హోటల్ బుక్ చేయడంతో బాలయ్య బాబు కూడా ఫీల్ అయ్యారట. కానీ ఆ విషయం బయటకి తెలియనివ్వకుండానే ఉన్నట్లు సమాచారం. దీంతో బాలయ్య, రవికుమార్ లు వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి హైదరాబాద్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారట.

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో బాలయ్య కొత్త లుక్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన సోనల్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిరంతన్ భట్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Spirit First Look అరాచకం.. షర్ట్ లేకుండా ప్రభాస్‌ లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. వంగా మామూలోడు కాదు
Suriya 46 Movie: సూర్య 46కి, గజినీకి సంబంధం ఏంటి? అంచనాలు పెంచేసిన నిర్మాత సమాధానం