సింహాల గోల వద్దంటున్న బాలయ్య!

By Prashanth MFirst Published Jun 11, 2019, 12:50 PM IST
Highlights

నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా మొత్తానికి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చాడు. బోయపాటితోనే మొదట వర్క్ చేస్తాడని టాక్ వచ్చినప్పటికీ ఫామ్ లో ఉన్న కెఎస్.రవికుమార్ తోనే నెక్స్ట్ సినిమా ఉంటుందని బాలయ్య ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు

నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్బంగా మొత్తానికి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చాడు. బోయపాటితోనే మొదట వర్క్ చేస్తాడని టాక్ వచ్చినప్పటికీ ఫామ్ లో ఉన్న కెఎస్.రవికుమార్ తోనే నెక్స్ట్ సినిమా ఉంటుందని బాలయ్య ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే బాలకృష్ణ సింహా సెంటిమెంట్ ని పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది. 

ప్లాప్ లు వెంటాడిన ప్రతి సారి సింహా పేరు వచ్చేలా టైటిల్ ను పెట్టి సక్సెస్ అందుకున్న బాలకృష్ణ మొదటిసారి ఆ గొల వద్దంటున్నారు. కెఎస్.రవికుమార్ తో ఇంతకుముందు చేసిన జై సింహా బాలయ్యకి మంచి విజయాన్నే ఇచ్చింది. అయితే ఇప్పుడు కూడా టైటిల్ చివరలో సింహా వచ్చేలా టైటిల్ పెడదామని దర్శకుడు నిర్ణయించగా అందుకు బాలయ్య నో చెప్పడట. 

కథ డిస్కర్షన్స్ లో క్రాంతి అని అనుకున్న టైటిల్ నే ఫిక్స్ చేయాలనీ డిసైడ్ అయినట్లు సమాచారం. కుదిరితే వీలైనంత త్వరగా క్రాంతి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యాలని నిర్మాతతో కూడా బాలయ్య మాట్లాడినట్లు టాక్. ఎన్టీఆర్ బయోపిక్స్ తో దారుణమైన ఫలితాల్ని అందుకున్న బాలయ్య నెక్స్ట్ సినిమాతో తప్పనిసరిగా హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఆ సినిమా బాలయ్యకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.  

click me!