బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా కథ ఇదే.. షూటింగ్‌ డిటెయిల్స్ చెప్పిన డైరెక్టర్‌..

Published : Apr 16, 2024, 04:10 PM IST
బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా కథ ఇదే.. షూటింగ్‌ డిటెయిల్స్ చెప్పిన డైరెక్టర్‌..

సారాంశం

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు మరో హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నారు. నెక్ట్స్ మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు బోయపాటి.   

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన కాంబోగా నిలిచింది. `సింహా`, `లెజెండ్‌`, `అఖండ` చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టారు. బాలయ్య మార్క్ మాస్‌ డైలాగ్‌లు, ఫైట్లని డిజైన్‌ చేయడంలో బోయపాటి తర్వాతనే ఎవరైనా అనేంతగా బెంచ్‌ మార్క్ సెట్‌ చేసి పెట్టారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా బిగ్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఆడియెన్స్ కి అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచింది. 

ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కబోతుంది. అయితే ఇది `అఖండ 2`గానే వస్తుందని సమాచారం. ఆ మధ్య ఈ మూవీని ప్రకటించారు. మరి షూటింగ్‌ ఎప్పుడు అనే దానిపై క్లారిటీ లేదు. తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చాడు. సినిమా ప్రారంభం, కథ, షూటింగ్‌ డిటెయిల్స్ ని వెల్లడించారు. 

కోకాపేటలో మూవీ టావర్స్ వద్ద కొత్తగా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కలిసి శివ కేశవ టెంపుల్‌ని నిర్మించారు. నిర్మాత సురేష్‌ బాబు సారథ్యంలో ఈ టెంపుల్‌ నిర్మాణం జరిగింది. సోమవారం ఈ టెంపుల్‌ని ప్రారంభించారు. ఇందులో చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. అందులో భాగంగా దర్శకుడు బోయపాటి శ్రీను కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో ముచ్చటించాడు. 

ఇందులో బోయపాటి శ్రీను మాట్లాడుతూ, బాలకృష్ణతో సినిమా విశేషాలను పంచుకున్నారు. ఎన్నికల తర్వాత ఈ మూవీని ప్రారంభిస్తామన్నారు. సమాజానికి ఏం కావాలి అనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తీయబోతున్నట్టు తెలిపారు. సమాజానికి అవసరం లేదని వాటి గురించి చెప్పబోతున్నామన్నారు. ``అఖండ`లో పసిబిడ్డ, ప్రకృతి, పరమాత్మ ఈ మూడింటిని టచ్‌ చేస్తూ వెళ్లాను. ఈసారి కూడా సొసైటీకి ఏం కావాలో అదే ఉంటుంది. మంచి కాన్సెప్ట్ తో వెళ్తున్నామని, దైవత్వం మన జీవితంలో భాగం అని, దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టచ్‌ చేస్తే చాలు` అని వెల్లడించారు దర్శకుడు బోయపాటి శ్రీను. 

ప్రస్తుతం బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే 109` చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. నవంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే వచ్చే సంక్రాంతికి ప్లాన్‌ చేస్తున్నారట. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?