'జై బాలయ్య' : వరుణ్ తేజ్‌కు బాలయ్య ఫ్యాన్స్ సెగ

Published : Sep 26, 2019, 04:52 PM ISTUpdated : Sep 26, 2019, 05:05 PM IST
'జై బాలయ్య' : వరుణ్ తేజ్‌కు బాలయ్య ఫ్యాన్స్ సెగ

సారాంశం

ఈ  సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను థ్యాంక్స్ తెలియచేయడానికి 'జైత్రయాత్ర' చేపట్టింది చిత్ర యూనిట్. అందులో భాగంగా గుంటూరు జిల్లా నంబూరులోని VVIT క్యాంపస్‌కు వెళ్లారు. 

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన 'గద్దలకొండగణేష్‌' సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. రిలీజ్‌ అయిన ప్రతీ చోట కలెక్షన్లతో దుమ్ముదులుపుతోంది. రీసెంట్ గా  మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు 'గద్దలకొండ గణేష్' సినిమా చూసి, మూవీ టీమ్‌ను అభినందించారు. అలా మంచి హ్యాపిగా ఉన్న ఈ టైమ్ లో బాలయ్య అభిమానులు గాలి తీసేసారు.

ఈ  సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను థ్యాంక్స్ తెలియచేయడానికి 'జైత్రయాత్ర' చేపట్టింది చిత్ర యూనిట్. అందులో భాగంగా గుంటూరు జిల్లా నంబూరులోని VVIT క్యాంపస్‌కు వెళ్లారు. అక్కడ వరుణ్ తేజ్ మాట్లాడుతుండగా.. స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా 'జై బాలయ్య.. జైజై బాలయ్య' అంటూ స్లోగన్స్ స్టార్ట్ చేసి షాక్ ఇచ్చారు. దీంతో వరుణ్ తేజ్ ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాడు.  సినిమా యూనిట్‌కి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. కొద్దిసేపు 'జై బాలయ్య' నినాదాలతో క్యాంపస్ హోరెత్తిపోయింది.

అందుకు కారణం లేకపోలేదు గతంలో నాగబాబు, బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యాలు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ మధ్య చెన్నైలో నాగబాబు పాల్గొన్న ఓ కాలేజ్ ఫంక్షన్‌లో ఆయన మాట్లాడుతుండగా.. 'జై బాలయ్య' స్లోగన్స్‌‌తో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు బాలయ్య అభిమానులు. .. ఇప్పుడు నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ వంతు వచ్చింది. వరుణ్ మాట్లాడుతుండగా.. స్టూడెంట్స్ 'జై బాలయ్య' స్లోగన్స్‌తో రచ్చ రచ్చ చేసారు. ఇప్పుడీ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

PREV
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్