నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం NBK108. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ అందింది.
‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) నెక్ట్స్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నటిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్లతో వరుస హిట్లను అందిస్తున్న అనిల్ రావిపూడి తొలిసారిగా మాస్ యాక్షన్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
బాలయ్య - అనిల్ రావిపూడి కాంబోలో సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. NBK108 వర్క్ టైటిల్ పేరుతో చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేశారు. రీసెంట్ గానే మేజర్ షెడ్యూల్ ఒకటి కంప్లీట్ అయ్యింది. ఇక ప్రస్తుతం మరో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా పరిసర ప్రాంతాల్లో యూనిట్ ఆసక్తికరమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ షెడ్యూల్ లో బాలయ్య - కాజల్ అగర్వాల్ మధ్య జరిగే సన్నివేశాలను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే శ్రీలీలా కూడా షూటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో బాలయ్యను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. మరోవైపు తెలంగాణలోనే కథ సాగుతుందని, అందుకు తగ్గట్టుగానే మాస్ యాక్షన్, డైలాగ్స్ ఉంటాయని హీనిచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ హిట్ గానే నిలిచాయి. ఇటు బాలయ్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బ్లాక్ బాస్టర్లను అందుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో ‘ఎన్బీకే108’ వస్తుండటం మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది. చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో కాజల్ కథానాయిక. శ్రీలీలా ముఖ్య పాత్ర పోషిస్తోంది.