అవతార్ 2 రిలీజ్ డేట్: షాకిచ్చిన దర్శకుడు.. వెయిట్ చేయక తప్పదు!

By Prashanth MFirst Published May 8, 2019, 8:16 PM IST
Highlights

2009లో వచ్చిన అవతార్ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జేమ్స్ కామెరూన్ సృష్టించిన అవతార్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అయితే నెక్స్ట్ సినిమాకు సంబందించిన రెండవ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

సినిమాను 2, 3, 4 పార్ట్ లుగా రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే తేదీలను కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు (అవతార్ 2) మరో డేట్ తో దర్శకుడు జేమ్స్ అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. అసలైతే అవతార్ సెకండ్ పార్ట్ 2020 డిసెంబర్ 18న రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ సినిమాను మరో ఏడాది వాయిదా వేశారు. 2021 డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నట్లు జేమ్స్ కామెరూన్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. 

అవతార్ 2 కోసం ఒక ఏడాది వెయిట్ చేస్తే సరిపోతుందని అనుకున్న అభిమానులకు ఇప్పుడు కొత్త డేట్ తో దర్శకుడు షాక్ ఇచ్చాడు. ఇంకా రెండేళ్లు వెయిట్ చేయక తప్పదు. సెకండ్ పార్ట్ రిలీజయితే 3 , 4 పార్ట్ లకు పెద్దగా గ్యాప్ ఇవ్వకపోవచ్చని సమాచారం. ఎందుకంటే ఆ రెండు భాగాలకు సంబందించిన సగం సీన్స్ ను దర్శకుడు ముందుగానే పూర్తి చేసుకుంటున్నాడు.    

click me!