ఆంటీలా ఉన్నావ్ అంటూ దారుణంగా ట్రోలింగ్.. పనీపాటా లేని వెధవ అంటూ కడిగిపారేసిన అరియనా, వీడియో

By Asianet News  |  First Published Oct 9, 2023, 10:49 AM IST

బిగ్ బాస్ 4 లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.


బిగ్ బాస్ 4 లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియాలో ఏం చేసిన వైరల్ అవుతోంది. ఆ మద్యన  అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. 

ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' చిత్రంలో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే తొలి చిత్రం. అరియనా సోషల్ మీడియాలో క్యూట్ లుక్స్ తో యువత హృదయాలు దోచుకుంటోంది. నెమ్మదిగా అరియనా ఎక్స్ ఫోజింగ్ పెంచుతోంది. వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది. అందుకే ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫొటోస్, వీడియోస్ తో మామూలు రచ్చ చేయడం లేదు.

Latest Videos

అయితే నాజూగ్గా ఉండే అరియనా ఈ మధ్యన బాగా బొద్దుగా మారింది. దీనితో అరియనా లావు అవుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆకతాయిలు మాత్రం అరియనా లావు కావడంతో అసభ్యంగా మెసేజ్ లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. ఒక అకౌంట్ నుంచి అరియనాకి పదే పదే అసభ్యకర మెసేజ్ లు వస్తున్నాయట. సీత అనే పేరు పెట్టుకుని ఒక ఆకతాయి అసభ్యంగా మెసేజ్ లు పెడుతున్నట్లు అరియనా వాపోయింది. 

అంతే కాదు ట్రోలింగ్ చేస్తున్న వారికీ అరియనా ఘాటుగా వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ గా మారింది. పనీపాటా లేని వేస్ట్ ఫెలోస్ కోసమే ఇది. సన్నగా ఉన్నప్పుడు ఏంటి ఇంత సన్నగా ఉన్నావ్ అంటారు. లావు అయితే ఏంటి ఇంతలావు అయ్యావ్ ఆంటీలాగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

 

అసలు నువ్వు ఎలా ఉంటావ్.. ముసుగులో కాకుండా ధైర్యంగా ఒక పోస్ట్ పెట్టు. నేను లావు అయితే నీకేంటి సన్నగా అయితే నీకేంటి. అంత ఇబ్బందిగా ఉంటే అన్ ఫాలో చేయవచ్చు కదా. కనీసం నా లైఫ్ లో నేను ప్రోగ్రస్ అవుతున్నా. నువ్వేం చేస్తున్నావ్ రా.. సీతా అనే పేరుతో కామెంట్స్ చేస్తున్నావ్. పనీపాటా లేకపోతే పని చూసుకుకో అంటూ అరియనా ట్రోలర్ ని కడిగిపారేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

click me!