విజయ్ దేవరకొండ హీరోయిన్ తో బాలీవుడ్ హీరో ఎఫైర్!

Published : Jul 02, 2019, 12:06 PM IST
విజయ్ దేవరకొండ హీరోయిన్ తో బాలీవుడ్ హీరో ఎఫైర్!

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ వ్యవహారాలు చాలా కామన్.. తాజాగా ఓ హీరో డేటింగ్ విషయం బయటపడింది.

సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ వ్యవహారాలు చాలా కామన్.. తాజాగా ఓ హీరో డేటింగ్ విషయం బయటపడింది. 'యూరి' సినిమాతో హీరోగా పాపులారిటీ దక్కించుకున్న విక్కీ కౌశల్.. నటి మాళవిక మోహనన్ తో ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది.

మలయాళీ ఇండస్ట్రీకి చెందిన మాళవిక ప్రస్తుతం విజయ్ దేవరొండ నటిస్తోన్న 'హీరో' అనే సినిమాలో నటిస్తోంది. ఈ బ్యూటీతో విక్కీ కౌశల్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు.  మాళవిక పరిచయమవ్వడం.. యూరి సినిమా పెద్ద సక్సెస్ కావడం ఒకేసారి జరగడంతో ఆమెని లక్కీగా ఫీలవుతున్నాడు.

దాదాపు ఆరేడు నెలలుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడూ ఈ విషయం బయటకి రాలేదు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న నటి రాధికాఆప్టే వీరి వ్యవహారాన్ని బయటపెట్టింది.

అదెలా అంటారా..? రాధికా ఆప్టే సోదరుడు మాళవికకు బాగా క్లోజ్ అట.. దీంతో విక్కీ-మాళవిక ఎఫైర్ గురించి తనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయని చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే. ఇకనైనా విక్కీ-మాళవిక తన ఎఫైర్ ను పబ్లిక్ గా ఒప్పుకోవాలని.. అలా చేయడం వలన పుకార్లు రాకుండా ఉంటాయని సలహా కూడా ఇచ్చింది.   

PREV
click me!

Recommended Stories

దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ