మోహన్ లాల్ కి శత్రువైన సల్మాన్ బ్రదర్!

Published : May 17, 2019, 04:06 PM IST
మోహన్ లాల్ కి శత్రువైన సల్మాన్ బ్రదర్!

సారాంశం

కంప్లీట్ యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ ఏ సినిమా చేసినా అందులో ఎదో ఒక కొత్థధనం ఉంటుంది. ప్రస్తుతం మలయాళంలో స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్న ఈ కథానాయకుడికి ఇప్పుడు సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్బజ్  కి శత్రువయ్యాడు

కంప్లీట్ యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ ఏ సినిమా చేసినా అందులో ఎదో ఒక కొత్థధనం ఉంటుంది. ప్రస్తుతం మలయాళంలో స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్న ఈ కథానాయకుడికి ఇప్పుడు సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్బజ్  కి శత్రువయ్యాడు. అంటే రియల్ లైఫ్ లో కాదులెండి. రీల్ లైఫ్ లో వీరిద్దరూ తెగ కొట్టుకుంటారట. 

ప్రముఖ దర్శకుడు సిద్ధిఖి డైరెక్షన్స్ లో మోహన్ లాల్ హీరోగా బిగ్ బ్రదర్ అనే సినిమా తెరకెక్కనుంది. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. కుదిరితే అక్టోబర్ లోనే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ఇక సినిమాలో మోహన్ లాల్ కి సమానంగా ఉండే విలన్ పాత్రలో అర్బజ్ ఖాన్ కనిపిస్తాడట. విలన్ రోల్ ప్రతి ఒక్కరికి సరికొత్త థ్రిల్ ని ఇస్తుందని దర్శకుడు చెబుతున్నాడు. బాలీవుడ్ లో ఈ మధ్య సినిమాలు తగ్గించిన అర్బజ్ మొదటిసారి మలయాళం ఇండస్ట్రీలోకి ఈ సినిమా ద్వారా అడుగుపెట్టబోతున్నాడు.  

PREV
click me!

Recommended Stories

Anirudh Kavya Marriage: అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి నిజమేనా? ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వబోతున్నారా?
Rakul Preet Singh: 7 దేశీ లుక్స్‌లో అదరగొట్టిన రకుల్.. అచ్చమైన ఇండియన్ బ్యూటీ ఎలా ఉందంటే?