పెళ్ళైన వ్యక్తితో సంబంధం పెట్టుకున్నా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Published : Aug 10, 2019, 02:37 PM ISTUpdated : Aug 10, 2019, 03:39 PM IST
పెళ్ళైన వ్యక్తితో సంబంధం పెట్టుకున్నా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

సారాంశం

నటి ఆండ్రియా పేరు చెప్పగానే కమల్ హాసన్ నటించిన విశ్వరూపం చిత్రం గుర్తొస్తుంది. విశ్వరూపం రెండు భాగాలలో ఆండ్రియా కీలక పాత్రలో నటించింది. తమిళంలో పలు చిత్రాల్లో కీలక పాత్రలు చేసినా సెకండ్ హీరోయిన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు మాత్రమే పరిమితం అయింది. ఆండ్రియా సింగర్ కూడా. 

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన 'వాడా చెన్నై' చిత్రం తర్వాత ఆండ్రియా సినిమాలు తగ్గించింది. అందుకుగల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మ్యూజిక్ ఆల్బమ్స్ తో ఆండ్రియా ప్రస్తుతం పలు ఈవెంట్స్ లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. 

వాడా చెన్నై చిత్రం సమయంలో తాను పెళ్ళైన ఓ ప్రముఖ వ్యక్తితో రిలేషన్ షిప్ పెట్టుకున్నానని తెలిపింది. కొన్ని రోజుల వరకు అతడు తనతో బాగానే ఉన్నా ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టాడని తెలిపింది. అతడి నుంచి దూరమయ్యాక బాగా డిప్రెషన్స్ కు గురయ్యా. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి.  

ట్రీట్మెంట్ తర్వాత డిప్రెషన్స్ నుంచి కోలుకుని ప్రస్తుతం మళ్ళీ పనిలో బిజీ అయ్యానని ఆండ్రియా తెలిపింది. ఇంతకీ తాను రిలేషన్ కొనసాగించిన వ్యక్తి పేరు మాత్రం ఆండ్రియా బయటపెట్టలేదు. ఆండ్రియా తెలుగులో తడాఖా చిత్రంలో నటించింది. గతంలో ఆండ్రియా ప్రేమ వ్యవహారాల గురించి అనేక రూమర్స్ వినిపించాయి. 

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి