అమ్మోరు రీషూట్ స్టోరీ: కోడి రామకృష్ణను కాదని..

First Published Feb 22, 2019, 8:35 PM IST

అమ్మోరు సినిమాకుఫస్ట్ డైరెక్టర్ కోడి రామ కృష్ణ కాదు. ఆ సినిమా తెరకెక్కడానికి నిర్మాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి చాలా కష్టపడ్డారు. అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

అమ్మోరు సినిమాకుఫస్ట్ డైరెక్టర్ కోడి రామ కృష్ణ కాదు. ఆ సినిమా తెరకెక్కడానికి నిర్మాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి చాలా కష్టపడ్డారు. అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
undefined
మెగాస్టార్ చిరంజీవి - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన కోడి రామకృష్ణ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేసి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు.
undefined
తెలుగు ప్రేక్షకులకు గ్రాఫిక్స్ టేస్ట్ చూపించిన మొదటి దర్శకుడు కోడిరామకృష్ణ. 1995లో వచ్చిన మైథలాజికల్ ఫాంటసీ ఫిలిం అమ్మేరు అప్పట్లో ఒక విజువల్ వండర్ గా హిట్టయ్యింది.
undefined
అసలైతే ఈ సినిమాను రెండు సార్లు తెరకెక్కించారు. మొదటిసారి సినిమా చూసి ఏ మాత్రం సంతృప్తి చెందని నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆ తరువాత కోడి రామ కృష్ణతో కొన్ని నెలలపాటు డిస్కర్స్ చేసి హై గ్రాఫిక్స్ తో సినిమాను తెరకెక్కించారు.
undefined
మొదట ఈ సినిమాకు కోదండరామిరెడ్డి శిష్యుడు వై.రామారావ్ దర్శకత్వం వహించారు. షూటింగ్ అనంతరం నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఏ మాత్రం సంతృప్తి చెందలేదు.
undefined
వెంటనే కోడిరామకృష్ణతో డిస్కర్స్ చేసి సినిమాను మళ్ళీ రీషూట్ కి శ్రీకారం చుట్టారు. అయితే అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన ఆగ్రహం సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ అంకుశం వంటి సినిమా హిట్టిచ్చినా తరువాత దిగ్గజ దర్శకుడిని నిర్మాత మరోసారి నమ్మారు.
undefined
అమ్మోరు సినిమా మొదలుపెట్టడానికి ముందు కోడి రామకృష్ణ అనేక గ్రాఫిక్స్ కి సంబందించిన పుస్తకాలను చదివారు. ఏ మాత్రం పట్టు వదలకుండా టెక్నాలిజీ గురించి బాగా స్టడీ చేశారు. ఎందుకంటే అప్పటివరకు తెలుగు సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఎవరు టచ్ చేయలేదు.
undefined
ఇక సినిమాలో అప్పటికి పెద్దగా పాపులర్ కానీ సౌందర్య - సురేష్ లను ప్రధాన పాత్రల్లో తీసుకొని రమ్యకృష్ణ ను అమ్మోరు పాత్రకు ఎంచుకున్నారు.
undefined
ఆ సినిమాకు సౌందర్య పారితోషికం 40 వేలు. ఆ తరువాత ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.
undefined
మొత్తానికి సినిమాను మూడేళ్లు కష్టపడి కోటి 80 లక్షల బడ్జెట్ తో పూర్తి చేశారు
undefined
మొదట రామ్ రెడ్డి విలన్ కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్నాను విలన్ రోల్ కి తీసుకున్నారు. తరువాత కోడి రామకృష్ణ రామ్ రెడ్డి ని సెలెక్ట్ చేసుకున్నారు.
undefined
శ్యామ్ ప్రసాద్ రెడ్డి విజన్ కు కోడి రామకృష కృషితో సిద్దమైన అమ్మోరు 1995 నవంబర్ 23న రిలీజయ్యి సరికొత్త బాక్స్ ఆఫీస్ ట్రెండ్ సెట్ చేసింది.
undefined
ఆ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోని కోడి రామ కృష్ణ స్టార్ దర్శకుడిగా క్లిక్ అయ్యారు.
undefined
click me!