నువ్వే మా అధినేత.. మీతో నాకు పోలికేంటి.. రజనీకాంత్‌కి అమితాబ్‌ రిప్లై..

Google News Follow Us

సారాంశం

అమితాబ్‌ బచ్చన్‌తో పనిచేయడం పట్ల రజనీకాంత్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. దీనికి బిగ్‌ బీ స్పందించారు. తనదైన స్టయిల్‌లో ఆయన రిప్లై ఇచ్చారు.

`నువ్వే అధినేతవు, నాయకుడివి, పెద్దవి.. నీతో నేను పోల్చుకోలేను` అని అంటున్నారు అమితాబ్‌ బచ్చన్‌. రజనీకాంత్‌తో కలిసి పనిచేయడంపై ఆయన తాజాగా స్పందించారు. 33ఏళ్ల తర్వాత అమితాబ్‌ బచ్చన్‌తో పనిచేయడం పట్ల రజనీకాంత్‌ ఎగ్జైటింగ్‌ నోట్‌ పెట్టారు. సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. తన మెంటర్‌ అని, ఆయనతో పనిచేయడం పట్ల తాను ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు, చాలా ఆనందంగా ఉందని రజనీ తెలిపారు. దీంతో తాజాగా అమితాబ్‌ స్పందించారు. 

ఇందులో బిగ్‌ బీ చెబుతూ, రజనీకాంత్‌ సార్‌, మీరు నా పట్ల చాలా దయ చూపుతున్నారు. అయితే సినిమా టైటిల్‌ని చూడండి, `తలైవర్‌170` దాని అర్థం చూస్తే, మీరే లీడర్‌, హెడ్‌, చీఫ్‌, నువ్వే అధినేత, నాయకుడు, పెద్ద, ఎవరికైనా ఈ విషయంలో డౌట్‌ ఉందా? నేను నీతో పోల్చుకోలేను. మళ్లీ మీతో కలిసి పనిచేయడం గొప్పగా, గర్వంగా ఉంది` అని అమితాబ్‌ బచ్చన్‌.. రజనీకి రిప్లైగా స్పందించారు.

`తలైవర్‌170` చిత్రం కోసం ఈ ఇద్దరు కలిశారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు రజనీ. బిగ్‌ బీతో కలిసి దిగిన ఫోటోని ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ `33ఏళ్ల తర్వాత టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రాబోయే లైకా మూవీ `తలైవర్ 170`లో నా మెంటర్‌ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది` అని ట్వీట్‌ చేశారు రజనీ. ఈ పోస్ట్ పోస్టర్‌ వైరల్‌ అవుతుంది. దీనికిపై విధంగా బిగ్‌ బీ స్పందించారు.

బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్, సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కలిసి పలు సినిమాల్లో నటించారు. చివరిసారిగా 1991లో `హమ్‌` అనే మూవీలో నటించారు. ఇది క్రిటికల్‌గా, కమర్షియల్‌గా పెద్ద హింట్‌ అయ్యింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతకు ముందు `అందా కానూన్‌`(1983), `గీరాఫ్తార్‌`(1985` చిత్రాలు చేశారు. ఈ మూవీస్‌ కూడా ఫర్వాలేదనిపించాయి.  దాదాపు 33ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కలిసి నటించబోతున్నారు. `జై భీమ్‌` ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...