Amitabh Bachchan : అభిమాని సందేహాన్ని తీర్చిన అమితాబ్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 15, 2022, 12:12 PM ISTUpdated : Jan 15, 2022, 12:21 PM IST
Amitabh Bachchan : అభిమాని సందేహాన్ని తీర్చిన అమితాబ్..

సారాంశం

బిగ్ బీ అమితాబ్ తన అభిమానికి కలిగిన సందేహాన్ని తీర్చాడు. అయితే గతంలో తాను అయ్యప్ప ఆలయానికి వెళ్లిన ఫొటోను ఆ అభిమాని అమితాబ్ కు ట్విట్టర్ లో షేరూ చేశాడు., ఆ ఫొటో వివరాలను తెలియజేయాలని కోరాడు. అందుకు అమితాబ్ స్పందిస్తూ అభిమాని సందేహాన్ని నివ్రుత్తి చేశారు. ఇంతకీ  ఆ ఫొటో వెనుక ఉన్న అసలు కథేంటంటే..

బిగ్ బి అమితాబ్ ఇండియా గర్వించదగ్గ గొప్ప నటులలో ఒకరు. తనకు మాత్రమే సాధ్యమైన నటనా ప్రతిభతో అమితాబ్ సినిమా రంగంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. అమితాబ్ బచ్చన్ ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొని నటుడిగా అగ్రస్థానానికి చేరుకున్నారు. ఎందరు నటులు వచ్చినా అమితాబ్ కంటూ సినిమా రంగంలో ప్రత్యేక స్థానం నిలిచిపోయింది. ఇదిలా ఉండగా అమితాబ్ బచ్చన్ కెరీర్ లోనే ఓ పీడకల లాంటి ఘటన 1982లో జరిగింది. 

అమితాబ్ బచ్చన్, రతి అగ్నిహోత్రి జంటగా నటించిన కూలి చిత్రం ఆ ఏడాదే చిత్రీకరణ జరుపుకుంది. ఆ చిత్ర షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ తీవ్రమైన ప్రమాదానికి గురయ్యారు. ఓ స్టంట్ సీన్ లో నటిస్తున్న సమయంలో కొన్ని అడుగుల ఎత్తు నుంచి ప్రమాదవశాత్తు టేబుల్ అంచున పడ్డారు. బెంగుళూరులో ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదంలో అమితాబ్ వెంటనే స్పృహ కోల్పోయారు. చిత్ర యూనిట్ వెంటనే అమితాబ్ ని బెంగుళూరులోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి ఆ తర్వాత ముంబైలోని మరో ఆసుపత్రికి తరలించారు. రెండు నెలలపాటు అమితాబ్ ఆసుపత్రిలోనే ఉన్నారు. 

అయితే  ఆ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత అయ్యప్ప తీర్థయాత్రకు వెళ్లారు. అప్పడు తీసిన  ఒక ఫొటో బిగ్ బీ అభిమాని వికాస్ అనే వ్యక్తికి  దొరికింది. దీంతో ఆ ఫొటోను అమితాబ్ కు ట్యాగ్ చేస్తూ కాస్త ఫొటోని సన్నివేశాన్ని వివరించాలని కోరాడు. దీంతో అమితాబ్ స్పందిస్తూ కూలీ మూలీ యాక్సిడెంట్ త్వర్వాత అయ్యప్ప తీర్థయాత్రకు వెళ్తున్నప్పటిదని వివరించారు. 
 

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా