అమల పెట్టిన పోస్ట్ చాలా మందికి కాలింది..ఆమె పై రివర్స్ కౌంటర్స్

Published : Apr 30, 2023, 12:52 PM IST
అమల పెట్టిన పోస్ట్  చాలా మందికి కాలింది..ఆమె  పై రివర్స్ కౌంటర్స్

సారాంశం

ఈ సినిమా మొదటి షో నుండి నెగిటీవ్ టాక్ ని సొంతం చేసుకొని ప్లాప్ లిస్టులోకి చేరిపోయింది. దీంతో సోషల్ మీడియాలో అఖిల్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.


తల్లికి కొడుకు మీద ప్రేమ ఉండటం సహజం...ఏ తల్లికైనా తన కొడుకు గొప్పగా ,అద్బుతంగా కనిపిస్తాడు..ఇవన్ని అమలను ఉద్దేశించి జనం అంటున్న మాటలు. అందుకు కారణం..ఆమె తన కొడుకు నటించిన ఏజెంట్ చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ, సినిమా అద్బుతంగా ఉందని  పోస్ట్ పెట్టడమే. తన కుమారుడు అఖిల్‌ (Akhil) నటించిన రీసెంట్‌ సినిమా ‘ఏజెంట్‌’ (Agent)పై వస్తోన్న విమర్శల గురించి నటి అమల (Amala) స్పందించారు. అభద్రతాభావంతోనే ట్రోల్స్‌ పుట్టుకువస్తాయని చెప్పిన ఆమె.. ఏదైనా సాధించడానికి అవి అవసరమేనని తెలిపారు.

‘‘ దైర్యంగా మాట్లాడలేనివారు మాత్రమే ఇలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారు. అలాంటి ట్రోల్స్ ని పట్టించుకోవడం అనవసరం. అఖిల్ కు కూడా అదే చెప్పాను. ఏజెంట్ సినిమా నేను చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. అఖిల్ కూడా చాలా బాగా చేశాడు. సినిమా కోసం అఖిల్ పడ్డ కష్టం ప్రతీ ఫ్రెమ్ లో కనిపిస్తుంది. నిజమే సినిమాలో కొన్ని లోపాలున్నాయి. నేను కాదు అనడం లేదు కానీ.. సినిమా చూస్తున్నంత సేపు అవేమి నాకు కనిపించలేదు. నేను ఈ సినిమాని థియేటర్ లో చూశాను. అక్కడ అమ్మలు, అమ్మమ్మలు, అమ్మాయిలు, కుర్రాళ్ళు.. ఎవరికి ఏ సీన్ నచ్చితే.. అప్పుడు వారు పెద్దగా అరుస్తున్నారు అని చెప్పుకొచ్చిన అమల.. అఖిల్ నెక్స్ట్ మూవీ మీ అందరిని మెప్పించాలని ఆశిస్తున్నాను’’ అని అమల పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అదే సమయంలో ఎంత తల్లి అయినా అలాంటి సినిమా ఎలా భరించమంటుంది ..ఎలా రికమెండ్ చేస్తుంది అని కొందరు ఆమెను ఆడిపోసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా తాము ఆశించినంతగా లేదని సినీ ప్రియులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఏజెంట్. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీని స్టైలిష్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించారు. ఇక మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఏజెంట్ మూవీ నిన్న భారీ స్థాయిలో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చింది. అయితే ఏజెంట్ ఫస్ట్ షో నుండి మిక్స్డ్ టాక్ ని దక్కించుకుంది. ప్రస్తుతం చాలా ఏరియాల్లో ఏజెంట్ కి కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు.
 

PREV
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?