'మహర్షి' ఎఫెక్ట్.. అల్లరి నరేష్ ఎమోషనల్ పోస్ట్!

Published : May 10, 2019, 12:27 PM IST
'మహర్షి' ఎఫెక్ట్.. అల్లరి నరేష్ ఎమోషనల్ పోస్ట్!

సారాంశం

తనలాంటి ఒక యువకుడిని నటుడిగా స్వీకరించినందుకు ప్రేక్షకులను ధన్యవాదాలు చెబుతున్నాడు అల్లరి నరేష్. 

తనలాంటి ఒక యువకుడిని నటుడిగా స్వీకరించినందుకు ప్రేక్షకులను ధన్యవాదాలు చెబుతున్నాడు అల్లరి నరేష్. ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. అటువంటి సమయంలో అతడికి 'మహర్షి' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.

గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. ముఖ్యంగా సినిమాలో అల్లరి నరేష్ పోషించిన రవి పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఎమోషనల్ అయిన అల్లరి నరేష్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

''పదిహేడేళ్ల క్రితం ఓ యువకుడు అందరిలానే తన గమ్యాన్ని వెతుక్కుంటున్నాడు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలడో.. లేదోఅనే విషయం అతడికి తెలియదు.. కానీ పట్టుబట్టి తన మనసు చెప్పిందే విన్నాడు.. 2002 మే 10న ఆ యువకుడు అల్లరి నరేష్ గా మరోసారి పుట్టాడు'' అంటూ తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా విడుదలయ్యి 17 ఏళ్లు అవుతున్న సందర్భంగా మరోసారి గుర్తు చేసుకున్నాడు.

అయితే ఇప్పుడు ఆ సినిమా ప్రస్తావన ఎందుకు తీసుకోచ్చానంటే.. దానికి కారణం రవి (మహర్షి సినిమాలో నరేష్ పాత్ర).. అంటూ చెప్పుకొచ్చాడు. 'అల్లరి' సినిమాలో తన పేరు రవి అని.. ఇప్పుడు 'మహర్షి' కూడా తన పేరు అదేనని.. 55 సినిమాల ప్రయాణం తన జీవితంలో ఎన్నో జ్ఞాపాకాలను నింపిందని అన్నారు. తనను ఇంతగా మెరుగుపరిచిన చిత్ర పరిశ్రమకు, తనపై నమ్మకం ఉంచిన దర్శకనిర్మాతలకు, అభిమానులకు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు. 

 

PREV
click me!

Recommended Stories

Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?