మంగళవారం ఎపిసోడ్ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మరోవైపు పవర్ అస్ర్తకి సంబంధించిన మాయాస్త్ర సాధించే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇది మరింత రంజుగా సాగింది.
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది. రెండో వారం షో యమ రంజుగా మారింది. ఉల్టా పుల్టా అన్నట్టుగానే హౌజ్‌లో కాలిక్యూలేషన్స్ ఉల్టా పుల్టా అవుతున్నాయి. ఇక మంగళవారం ఎపిసోడ్ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మరోవైపు పవర్ అస్ర్తకి సంబంధించిన మాయాస్త్ర సాధించే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇది మరింత రంజుగా సాగింది.
ఇక ఎపిసోడ్ ప్రారంభంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. సోమవారం ఎపిసోడ్‌లో దామినిని ఎవరూ నామినేట్ చేయలేదు. సంచాలకుడు సందీప్.. ప్రిన్స్ యావర్‌ని నామినేట్ చేశాడు. శివాజీని అమర్ దీప్, ప్రియాంక, శోభాశెట్టి, దామిని నామినేట్ చేశారు. పల్లవి ప్రశాంత్‌ని గౌతంకృష్ణ, తేజ, ప్రియాంక, షకీలా, అమర్ దీప్ లు నామినేట్ చేయగా, నేడు దాన్ని శోభాశెట్టి, రతికలు కొనసాగించారు. శోభాశెట్టిని శివాజీ, అమర్ దీప్‌ని శివాజీ, పల్లవి ప్రశాంత్, రతికని తేజ నామినేట్ చేశారు. షకీల కూడా నామినేషన్‌లో ఉన్నారు.
ఇందులో అత్యధికంగా పల్లవి ప్రశాంత్‌కి ఎనిమిది ఓట్లు పడ్డాయి. ఓ రకంగా హౌజ్ మొత్తం రైతు బిడ్డని టార్గెట్ చేసింది. తను అమ్మాయిల వెంటపడుతున్నాడని, అసలు గేమ్ ఆడటం లేదని శోభా శెట్టితోపాటు మేజర్ సభ్యులు భావించారు. గత సీజన్ల ఎపిసోడ్లు చూసి దాన్ని ఫాలో అవుతున్నావని, యాక్టింగ్ చేస్తున్నావని కామెంట్లు చేశారు. అది మానుకోవాలని తెలిపారు. ఒరిజినల్ ఆట ఆడాలని తెలిపారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టారు. మరోవైపు శివాజీ, శోభా శెట్టి విషయంలోనూ గొడవ జరిగింది. ఈ ఇద్దరు గట్టిగానే వాదించుకున్నారు. నువ్వు తోపు అయితే బయట ఇక్కడ కాదని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది శోభా శెట్టి. ఇది కాసేపు రచ్చ చేసింది. రెండో వారంలో పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతిక, షకీలా, శోభాశెట్టి, శివాజీ, తేజ, గౌతమ్ కృష్ణ, అమర్ దీప్ ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేట్ అయ్యారు.
అనంతరం మాయాస్త్రని సాధించే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మాయాస్త్ర బిగ్ బాస్ హౌజ్ లోపలే ఉందని, ఏడువేల సంవత్సరాల క్రితం దాన్ని రెండు సముహాలు సాధించి, ఆ పవర్‌ని మాయాస్త్రలో దాచిపెట్టాయని, దాన్ని సాధించేందుకు ఆ రెండు సముహాలు ఇప్పుడు వచ్చాయని, దాన్ని సాధించాలని తెలిపారు. హౌజ్‌ని రెండు సముహాలుగా విభిజించారు బిగ్ బాస్. అమర్ దీప్, ప్రిన్స్ యావర్, షకీలా, శివాజీ, శోభా శెట్టి, ప్రియాంక.. ఈ ఆరుగురు సభ్యులను రణధీర టీమ్‌గా నిర్ణయించారు.
గౌతమ్ కృష్ణ, తేజా, రతికా రోజ్, దామిని, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ ఒక టీమ్ గా ఏర్పడ్డారు. ఈ టీమ్ కి మహాబలి అని పేరు పెట్టారు. ఆల్రెడీ పవర్ అస్త్ర గెలిచిన ఆట సందీప్ ని సంచాలకుడిగా వ్యవహరించారు. ఈ రెండు టీమ్‌లో తమ బలాన్ని ప్రదర్శించాయి. మూడు రౌండ్లుగా ఇది జరగ్గా.. రణధీర టీమ్ మూడు పాయింట్లతో విన్నర్‌గా నిలిచింది. మహాబలి టీమ్ ఒక్క పాయింట్‌ని కూడా సాధించలేకపోయింది. దీంతో మాయాస్త్రని సాధించేందుకు సంబంధించిన కీని బిగ్ బాస్ విన్నర్‌కి ఇచ్చారు. అయితే దాన్ని కొట్టేసేందుకు రాత్రి కుట్ర జరగడం విశేషం. మరోవైపు హౌజ్ మేట్స్ కి డీలక్స్, స్టాండర్డ్ రూమ్ లను కేటాయించారు.