అఖిల్ పుట్టే సమయం.. నా జీవితంలోనే అది బెస్ట్ మూమెంట్.. నాగార్జున ఎమోషనల్ కామెంట్స్

By Asianet News  |  First Published Aug 6, 2023, 2:01 PM IST

కింగ్, అక్కినేని నాగార్జున తన జీవితంలోనే బెస్ట్ మూమెంట్ ను ఓ కార్యక్రమంలో పంచుకున్నారు. ఆ సమయంలో ఆరు నెలలు ఇంట్లోనే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. నాగ్ కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. 
 


టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్, అక్కినేని నాగార్జున (Nagarjuna) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆన్ స్క్రీన్ అయినా.. ఆఫ్ స్క్రీన్ అయినా చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తుంటారు. స్టైలిష్ లుక్ లో ఇప్పటికీ మన్మధుడిగానే ఆకట్టుకుంటున్నారు. ఆరుపదుల వయస్సులోనూ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నారు. మరోవైపు బుల్లితెరపైనా ‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీషోను రన్ చేస్తూ ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు. 

‘బిగ్ బాస్’తో మంచి గుర్తింపు దక్కించుకొని.. ప్రస్తుతం హీరోగా ఎదుగుతున్న సోహెల్ కొత్త సినిమా ట్రైలర్ ను నాగార్జున నిన్న లాంఛ్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’  (Mr.Pregnant)గా ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ హీరో సోహైల్, రూపా కొడవయూర్ హీరో హీరోయిన్లుగా మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. సినిమాను దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 18న 'మిస్టర్ ప్రెగ్నెంట్' విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ మూవీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ను నాగ్ రిలీజ్ చేశారు. సినిమాపై ఆసక్తిని పెంచేసిందన్నారు. ట్రైలర్ చాలా ఎమోషనల్ గా ఉందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్  చేశారు. 

Latest Videos

undefined

నాగార్జున  మాట్లాడుతూ - బిగ్ బాస్ లో కప్పు గెలవకుండానే విన్నర్ అయ్యాడు సోహైల్. చాలా తెలివైన వాడు. ప్రతి గేమ్, ప్రతి టాస్క్ కష్టపడి ఆడేవాడు. గెలవాలనే తపన అతనిలో కనిపించేది. అలాంటి పట్టుదలతోనే ఈ సినిమా చేశాడు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనగానే మగవాళ్లు ప్రెగ్నెంట్ ఎలా అవుతారు. అది సినిమాలో ఎలా చూపించారు అనే ఆసక్తి కలిగింది. ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ ఎమోషనల్ గా ఉంది. దర్శకుడు శ్రీనివాస్ కు ఇది ఫస్ట్ మూవీ. ఆయనే స్క్రిప్ట్ రాశాడు. డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇది. బాగా తెరకెక్కించాడని అర్థమవుతోంది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.  మైక్ మూవీస్ లో నాలుగో సినిమా ఇది. సక్సెస్ అవ్వాలని హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నాను. 

ఇక డెలివరీ అంటే ఒక ప్రాణం పోయడం. అఖిల్ డెలివరీ టైమ్ లో ఆరు నెలలు ఏ షూటింగ్స్ పెట్టుకోలేదు. మదర్‌హుడ్ అనేది అందమైన అనుభూతి. నాకు ప్రతి నిమిషం గుర్తుంది. హలో బ్రదర్ షూటింగ్ ఫినిష్ చేసుకున్నాక ఆరు నెలలు సినిమాలు మానేసి ఆరునెలలు అమలతోనే ఉన్నాను. ఆ టైమ్ నా లైఫ్ లో బెస్ట్ మూవ్ మెంట్ అంటూ.. ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. అనంతరం తన మాటలతో నవ్వులు కూడా పూయించారు. 

హీరో సోహైల్ మాట్లాడుతూ - తెలుగు ప్రేక్షకుల్లో నాకు దక్కిన గుర్తింపునకు నాగార్జున గారే కారణం. ఆయన బిగ్ బాస్ లో మమ్మల్ని ఎంతో ఎంకరేజ్  చేశారు. సొంత వాళ్లలా చూసుకున్నారు. ఎప్పుడూ ధైర్యం చెబుతారు. ఈ సినిమా గ్లింప్స్ ఆయనకు చూపించి, ట్రైలర్ రిలీజ్ కు రావాలని కోరాను. నాగ్ సార్ కు ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే. తొమ్మిది నెలలు బిడ్డను మోసి కనేందుకు తల్లి ఎంత కష్ట పడుతుందో మనం వింటుంటాం. కానీ ఆ కష్టాన్ని ఒక అబ్బాయిగా నా పాత్ర ద్వారా చూపించబోతున్నాను. చాలా మంచి మూవీ. ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ రెండూ ఉంటాయి.  ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి అమ్మను హగ్ చేసుకుంటారని చెప్పుకొచ్చారు. 

హీరోయిన్ రూపా కొడవయూర్ మాట్లాడుతూ..  కొత్త తరహా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక ఫీస్ట్ లాంటి సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ కోసం నన్ను అప్రోచ్ అయినప్పుడు చేయడం సాధ్యమేనా అనిపించింది. కానీ బ్యూటిఫుల్ గా మూవీని తెరకెక్కించారు. అప్పిరెడ్డి గారు ఎప్పుడూ తెలుగు హీరోయిన్స్ కు అవకాశాలు ఇస్తుంటారు. మైక్ మూవీస్ నాకొక ఫ్యామిలీలా అనిపిస్తుంటుంది. 

నిర్మాతలు రవిరెడ్డి  సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి, అప్పిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. మా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన కింగ్ నాగార్జున గారికి థాంక్స్ చెబుతున్నాం. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డైరెక్టర్ ఆర్జీవీ మొదలు..ఇప్పటిదాకా ఎంతోమంది న్యూ టాలెంట్ ను పరిచయం చేసిన ఘనత ఆయనది. మేమందరం ఆయన అభిమానులమే. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ మనసుకు దగ్గరైన సినిమా. ఈ సినిమా మహిళల గొప్పదనం చెప్పేందుకు చేసిన సినిమా. మహిళా ప్రేక్షకులంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. మైక్ మూవీస్ నుంచి వచ్చే ప్రతి సినిమాను కొత్త కథలతో నిర్మిస్తున్నాం. కొత్తగా  చేసే ప్రయత్నాలను మన ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమాకు కూడా విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాం. 

click me!