శ్రీదేవి చివరి కోరిక నెరవేరుతోంది!

Published : Mar 06, 2019, 04:59 PM IST
శ్రీదేవి చివరి కోరిక నెరవేరుతోంది!

సారాంశం

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సమాజంలో మహిళ హక్కులు వాటి చట్టాల నేపథ్యంలో ఉండే ఈ సోషల్ థ్రిల్లర్ కథను సౌత్ లో ఎవరు చేస్తారా అనే విషయం గత కొంత కాలంగా కన్ఫ్యూజన్ కే గురి చేసింది. 

ఫైనల్ గా ఫస్ట్ లుక్ తో కోలీవుడ్ థలా అజిత్ అందరికి షాక్ ఇచ్చాడు. ఒక మధ్య వయస్కుడిగా ప్రయోగాత్మకమైన పాత్రలో అజిత్ తెల్లని గెడ్డంతో కనిపించనున్నాడు. అయితే నటి శ్రీదేవి ఈ సినిమాను సౌత్ లో తెరకెక్కించాలని మరణానికి ముందు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఆమె కోరికను ఇప్పుడు భర్త బోణి కపూర్ తీర్చనున్నాడు. శ్రీదేవి చివరి కోరిక అదే అని అప్పట్లో బోణి కపూర్ వివరణ ఇచ్చారు.  

అజిత్ డేట్స్ దొరకడంతో బోణి కపూర్ బ్యానర్ లో ఇప్పుడు గ్రాండ్ గా దర్శకుడు హెచ్. వినోథ్ షూటింగ్ ప్లాన్ తో రెడీ అవుతున్నాడు. ఇంతకుముందు వినోత్ కార్తీ తో ఖాకి సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న ఈ కథ ఇప్పుడు కోలీవుడ్ లో ఏ స్థాయిలో హిట్టవుతుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో