
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) నటించిన ‘కిర్రాక్ పార్టీ’ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది సంయుక్తా హెగ్దే (Samyuktha Hegde). ఈ మూవీతోనే తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. తొలిచిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. వరుస చిత్రాల్లో నటిస్తూ తన అభిమానులు, ఆడియెన్స్ ను అలరిస్తున్న సంయుక్తా హెగ్దే తాజాగా షూటింగ్ లో పాల్గొనగా తీవ్రంగా గాయపడింది. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టిం వైరల్ గా మారింది.
స్టార్ హీరోలకు పోటీగా యంగ్ హీరోయిన్లు నటనతో పాటు.. యాక్షన్ సన్నివేశాల్లోనూ ఇరగదీస్తున్నారు. తగిన శిక్షణ తీసుకొని కెమెరా ముందుకు స్టంట్స్ కొడుతున్నారు. డూప్ లు లేకుండా ఇంతటి విన్యాసాలు చేస్తుండటంతో.. కొన్ని సార్లు ప్రమాదాల బారిన పడటం తప్పడం లేదు. గతంతో రామ్ పోతినేని, సిద్ధార్థ్ మల్హోత్రా గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ యంగ్ హీరోయిన్ సంయుక్తా హెగ్దేకు ఈ పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ బ్యూటీ తను నటిస్తున్న కన్నడ ఫిల్మ్ ‘క్రీమ్’(Kreem) షూటింగ్ లో పాల్గొని తీవ్రంగా గాయపడింది.
‘క్రీమ్’ చిత్ర యూనిట్ తాజాగా యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. సంయుక్తా హెగ్దే పలువురు రౌడీలను ఎదుర్కొనే సమయంలో కొన్ని స్టంట్స్ చేసే సీనది. ఈ క్రమంలో హెగ్దే ప్రత్యర్థులను మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ తో పడగొడుతుంటుంది. వరుసగా స్టంట్స్ కొట్టే సమయంలో కాలుకు తీవ్రంగా గాయమైంది. దీంతో అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే చిత్ర యూనిట్ ఆమె వద్దకు వచ్చి హుఠాహుఠినా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెను కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
అయితే షూటింగ్ సమయంలో సంయుక్తా మీనన్ ఎలా గాయపడిందో ఆడియెన్స్ కు తెలియజేసేందుకు మేకింగ్ వీడియోను షేర్ చేసింది. వీడియో చూసిన తన అభిమానులు, ఆడియెన్స్ ను త్వరగా కోలుకోవాలని దేవుడి ప్రార్థిస్తున్నారు. వీడియో షేర్ చేస్తూ సంయుక్తా ఇలా కామెంట్స్ చేసింది. టేకింగ్ లో తనకు గాయమైనా.. సినిమా రిలీజ్ తర్వాత ఆ ఫైట్ చూసి ప్రేక్షకులు ఖుషీ అవుతారని తెలిపింది. తెలుగులో ఒక్క చిత్రంలోనే నటించిన ఈ బ్యూటీ కన్నడ, తమిళంలో మాత్రం వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.