రెండులక్షల ఫోన్‌ దొంగతనం.. కేస్‌ ఫైల్‌.. పన్నెండు రోజుల తర్వాత కొరియర్‌ చూసి నటి షాక్‌..

By Aithagoni RajuFirst Published Apr 24, 2023, 8:59 PM IST
Highlights

తమిళ నటి షాలు షము ఐ ఫోన్‌ దొంగతనానికి గురయ్యింది. ఓ పార్టీకి వెళ్లొచ్చిన తర్వాత ఆమె ఫోన్‌ కనిపించకుండా ఫోయింది. కానీ పన్నెండు రోజుల తర్వాత వచ్చిన పార్సెల్‌ చూసి ఆమె షాక్‌ అవడం విశేషం.

తమిళ నటి షాలు షము ఫోన్‌ దొంగతనం కేసు ఆసక్తికరంగా మారింది. మైండ్‌ బ్లోయింగ్‌ చేసే ట్విస్ట్ తో కూడిన పరిష్కారం అందరిని షాక్‌కి గురిచేస్తుంది. పది రోజుల క్రితం తర్వాత కొరియర్‌లో చూసి షాక్‌ కి గురయ్యింది నటి షాలు షము. మరి ఇంతకి తన ఫోన్‌ ఎలా పోయింది, ఎవరు కొట్టేశారు, ఎలా వచ్చింది? మధ్యలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఆ వివరాలు చూస్తే, 

`వరుథపడతా వలిబర్ సంఘం`, `తమిజుకు ఎన్ ఓండ్రై అజుథవుమ్‌`, `రెక్కా` వంటి తమిళ చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది కోలీవుడ్‌ నటి షాలు షము. ఆమె ఈ ఏడాది జనవరిలో రెండు లక్షల విలువ చేసే ఐ ఫోన్‌ కొనుగోలు చేసింది. ఆమె ఏప్రిల్‌ 9న చెన్నైలోని ఎఆర్‌సీ నగర్‌ లోని హోటల్‌లో ఈస్టర్‌ పార్టీకి వెళ్లింది. ఆ పార్టీ అనంతరం ఆమె ఆ రోజు రాత్రి చూలైమేడులో గల తన ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లింది. తెల్లారిన తర్వాత నటి తన ఫోన్‌ చూసుకుంటే కనిపించలేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేదు. ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వస్తుంది. సీసీటీవీ ఫూటేజ్‌ చెక్‌ చేసినా ప్రయోజనం లేదు. దీంతో షాలు.. ఏప్రిల్‌ 11న ఫోర్‌షోర్‌ ఎస్టేట్‌ పోలీస్‌స్టేషన్‌లో కంప్లెయింట్‌ చేసింది. 

Latest Videos

తన ఫ్రెండ్‌ ఇంటి వద్ద నుంచి తన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయినట్టుగా గుర్తించారు. ఆ అనుమానంతో తన స్నేహితుల పేర్లని కూడా ఫిర్యాదులో పేర్కొంది నటి షాలు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కానీ అనూహ్యంగా ఏప్రిల్‌ 22న(శనివారం) నటి షాలు ఇంటికి ఓ కొరియర్‌ పార్సల్‌ వచ్చింది. అది ఎవరు పంపించారనేది లేదు. కానీ అది ఓపెన్‌ చేసి చూడగా, అందులో తన ఫోన్‌ కనిపించింది. దీంతో నటి షాక్‌ కి గురయ్యింది. తన ఆనందానికి అవదుల్లేవు. 

ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఇది తన ఫ్రెండ్ చేసిన పనే అని తర్వాత ఆమెకి అర్థమైంది. దీంతో తన 18ఏళ్ల ఫ్రెండ్‌షిప్‌కి గుడ్‌ బై చెప్పింది షాలు షము. అయితే దీనిపై పోలీసులు నటి ఫ్రెండ్స్ ని విచారిస్తున్నారు. కానీ ఫోన్‌ దొరికినట్టు నటి నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని పోలీసులు తెలియజేయడం గమనార్హం. 

click me!